NTR First Remuneration : ఎన్‌టీఆర్ నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఈతరానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన ఒక సాధారణ నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ప్రతి ఒక్కరి మనసులను గెల్చుకొని మహా నటుడి స్థాయికి ఎదిగారు. ఆయన నటించిన మొదటి సినిమా పేరు ‘మన దేశం’. ఈ మూవీ నేటికి సరిగ్గా 75 ఏళ్ల క్రితం 1949 నవంబరు 24వ తేదీన రిలీజ్ అయింది. ఎన్‌టీఆర్ మొట్టమొదటి మూవీ ‘మన దేశం’తో ముడిపడిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Saira Banu : ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు.. ఆయనపై విమర్శలొద్దు : సైరా బాను
- ‘మన దేశం’ మూవీలో ఎన్‌టీఆర్ బ్రిటీష్ పోలీస్‌గా ఓ చిన్న పాత్రలో నటించారు.
- ఆ సినిమాను ‘విప్రదాస్’(NTR First Remuneration) అనే బెంగాలీ నవలలోని కథ ఆధారంగా తీశారు. భారత స్వాతంత్య్ర పోరాటమే ఈ మూవీ కథకు నేపథ్యం.
- ఈ మూవీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన తొలి సినిమా కూడా ఇదే. గాయని పి. లీల కూడా మనదేశం మూవీ ద్వారానే తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు.
- ఈ సినిమాలో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాల గురించి, స్వాతంత్రం వచ్చాక దేశంలో దిగజారిన విలువల గురించి చక్కగా చూపించారు.
- బెంగాలీ కథ ఆధారంగా తీసిన తొలి సినిమా ఇదే.
- ఈ మూవీలో పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించినందుకు ఎన్‌టీఆర్కు రూ.2వేల పారితోషికం ఇచ్చారు.
- మన దేశం మూవీలోని ఇతర ముఖ్యపాత్రలను పోషించిన వారిలో నాగయ్య, సి.హెచ్ నారాయణ రావు, కృష్ణవేణి, రేలంగి, వంగర ఉన్నారు.
- ‘మన దేశం’ మూవీకి డైరెక్షన్ చేయడానికి ముందు 1946లో ‘గృహప్రవేశం’ మూవీని స్వయంగా ఎల్వీ ప్రసాద్ తీశారు. అది సక్సెస్ అయింది.
- ‘గృహప్రవేశం’ మూవీ సక్సెస్ అయ్యాక.. మరో మూవీ తీయడానికి ఎల్వీ ప్రసాద్ రెడీ అయ్యారు. కొత్త నటులు కావాలని ఆయన ప్రకటన వేశారు. దాన్ని చూసి ఎన్‌టీఆర్ కూడా వెళ్లారు. నటులను ఎంపిక చేసే టీంలో దర్శకుడు ఎల్వీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఒడ్డూ పొడుగు, ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు, చక్కటి వాచకం, గంభీరమైన స్వరం, నాటకానుభవం ఉన్న యువతేజం ఎన్టీఆర్‌ను చూసి ఎల్వీ ప్రసాద్ ఇంప్రెస్ అయ్యారు. ఆయనను ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ సినిమా నిర్మాణం అకస్మాత్తుగా ఆగిపోయింది.
- ఆ టైంలో ప్రముఖ నిర్మాత, నటి కృష్ణవేణి ‘మనదేశం’ మూవీ తీయడానికి రెడీ అయ్యారు. డైరెక్టర్‌గా చేయాలని ఎల్వీ ప్రసాద్‌ను కృష్ణవేణి కోరారు. ఈ మూవీలోని పోలీసు ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఎన్‌టీఆర్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఎల్వీ ప్రసాద్ డిసైడయ్యారు. ఆయనను పిలిపించి నటించమని చెప్పారు.