Radhika Assets : ఎన్నికల బరిలో హీరోయిన్‌ రాధిక.. ఆస్తుల చిట్టా ఇదిగో

Radhika Assets : సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Radhika Sharathkumar Sensational Comments On Animal Movie

Radhika Sharathkumar Sensational Comments On Animal Movie

Radhika Assets : సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటికే రాధిక నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రస్తావించారు. తనకు మొత్తం రూ.53.45 కోట్ల ఆస్తులు ఉన్నాయని రాధిక వెల్లడించారు.

Also Read : Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్​, అన్​లాక్ చేయండిలా

  • తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నాయని రాధిక నామినేషన్ పత్రాల్లో తెలిపారు.
  • రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు  ఆమె చెప్పారు.
  • రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాధిక వ్యవహరిస్తున్నారు.
  • రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చిని ఇటీవలే బీజేపీలో విలీనం చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ ఆయన భార్యకు(Radhika Assets) లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్‌ టికెట్‌ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది. అదే సమయంలో  సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్‌ నామినేషన్‌ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్‌ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన‌ అక్క‌డున్న‌వారంతా కాసేపు షాక్‌కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

Also Read :Bridge Collapse : నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి

  Last Updated: 26 Mar 2024, 03:47 PM IST