Elephant Thief : ఇళ్ల‌లో నుంచి తిండి దొంగిలిస్తున్న ఏనుగు

త‌రిగిపోతున్న అడవుల నుంచి ఏనుగులు బ‌య‌ట‌కు రావ‌డం, తిండి కోసం పొలాలు ధ్వంసం చేయ‌డం త‌మిళ‌నాడులో చాలా కామ‌న్‌గా చూస్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - November 25, 2021 / 01:11 PM IST

త‌రిగిపోతున్న అడవుల నుంచి ఏనుగులు బ‌య‌ట‌కు రావ‌డం, తిండి కోసం పొలాలు ధ్వంసం చేయ‌డం త‌మిళ‌నాడులో చాలా కామ‌న్‌గా చూస్తూ ఉంటాం. కొన్ని మ‌ద‌పుటేనుగులు అయితే ఏకంగా త‌మ తొండంతో ఇల్లు మొత్తాన్ని నాశ‌నం చేసి మ‌రీ తిండి తీసుకుని పోతూ ఉంటాయి. అయితే వీట‌న్నిటికీ భిన్నంగా ఒక ఏనుగు మాత్రం సైలెంట్‌గా దొంగ‌త‌నం చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Also Read : త‌ల్లికి దారి చూపుతున్న పిల్ల ఏనుగు…నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఫోటో

నీల‌గిరి అడ‌వుల మ‌ధ్య‌లోని ప‌దాన్‌తొరాయ్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఊళ్లోకి రెగ్యుల‌ర్‌గా వ‌స్తున్న ఓ మ‌ఖ‌నా ఏనుగు.. స‌రిగ్గా వంటిటి ద‌గ్గ‌ర‌కు వెళ్లి తిండి దొంగిలించ‌డానికి ఓ రంధ్రం చేస్తోంద‌ట‌. దీన్ని గ‌మ‌నించిన ఇంట్లోని వాళ్లు భ‌యంతో ప‌రుగులు తీశారు.


(Representative Video)

ఈ మ‌ధ్య‌కాలంలో గుడ‌లూర్ అట‌వీ ప్రాంతంలో ఏనుగుల సంచారం విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ఫారెస్ట్ అధికారులు ముమ్మ‌రంగా గ‌స్తీ తిరుగుతున్నారు. స్ధానికులు కూడా త‌మ‌ను ఏనుగుల బెడ‌ద నుంచి కాపాడండి అంటూ అధికారుల‌కు విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. దీంతో గ్రామ‌స్తుల‌ను కాపాడ‌టానికి ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగుల‌ను మ‌రికొద్దిరోజుల్లో గ్రామాల బ‌య‌ట పెట్ట‌నున్న‌ట్టు ఫారెస్ట్ అధికారులు చెప్పారు.

Also Read: ప్రమాదం లో గజరాజులు!