Pakistan Map : భారతదేశ మ్యాప్ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి పాకిస్తాన్‌కు రుణం మంజూరు కావడాన్ని విమర్శిస్తూ ఇటీవలే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో ఉన్న పాకిస్తాన్ మ్యాప్‌లో కశ్మీరు కూడా కలిసి ఉంది. ఈ అంశమే వివాదానికి దారితీసింది. కశ్మీరును పాకిస్తాన్ మ్యాప్‌లో కలిపి చూపడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఈ అంశంపై కర్ణాటక బీజేపీ నేతలు ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో వెంటనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తప్పుడు పాకిస్తాన్ మ్యాప్‌తో కూడిన ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది.
Also Read :PV Narasimha Rao : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు విగ్రహం
డీకే శివకుమార్ ఏమన్నారంటే..
ఈ అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(Pakistan Map) స్పందించారు. ‘‘అది చిన్న పొరపాటు. వెంటనే మేం దిద్దుబాటు చర్యలు చేపట్టాం. ఆ తప్పుడు పోస్ట్ పెట్టిన వారిని విధుల నుంచి తప్పించాం. ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే ఎవరినీ ఉపేక్షించం. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తపడతాం. భారత్ నుంచి కశ్మీరును ఎవరూ దూరం చేయలేరు. అది మన దేశంలో అంతర్భాగం’’ అని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. అయితే ఇది చిన్న పొరపాటే అని డీకే వ్యాఖ్యానించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. మ్యాప్‌లను వినియోగించే క్రమంలో తప్పకుండా క్రాస్ చెకింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు కూడా సమాచారాన్ని పంపినట్లు తెలిసింది.
Also Read :India-Pak : భారత్, పాక్ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు
గతంలోనూ పలు సందర్భాల్లో..
గతంలోనూ పలు సందర్భాల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా తప్పుడు మ్యాప్‌లను వినియోగించింది. 2024 డిసెంబరులో కర్ణాటకలోని బెలగాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఆ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయించిన బ్యానర్లపై భారతదేశ మ్యాప్‌ను ప్రింట్ చేయించారు. అయితే ఆ భారతదేశ మ్యాప్‌లలో జమ్మూకశ్మీరు మిస్సయింది. దీనిపై అప్పట్లో నెటిజన్లు, బీజేపీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా సదరు బ్యానర్లను ప్రింట్ చేయించిందని, అందువల్లే తప్పుడు భారత మ్యాప్ ప్రింట్ అయిందని ప్రజానీకం ఆనాడు అభిప్రాయపడ్డారు.