Bus Rule: బస్సులో ప్రయాణిస్తూ ఫోన్ వాడుతున్నారా? మీ పని ఖతమే

బస్సు ఎక్కగానే అందరు చేసేపని ఏంటంటే మొబైల్ తీసి నొక్కడమో,వీడియోలు చూడడమో.

  • Written By:
  • Publish Date - November 14, 2021 / 08:00 AM IST

బస్సు ఎక్కగానే అందరు చేసేపని ఏంటంటే మొబైల్ తీసి నొక్కడమో,వీడియోలు చూడడమో. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టే పనిలో ఆర్టీసీ అధికారులు ఉన్నారట. ఇంతకీ ఇది ఎందుకో ఎక్కడో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

సాధారణంగా జర్నీ లో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు, తెలియకుండా టైమ్‌ గడిచిపోయేందుకు మొబైల్ లో సినిమాలు, వీడియోలు చూస్తుంటారు. వీరిలో కొందరు ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని మ్యూజిక్ లేదా వీడియోలు చూస్తుంటే మరికొంతమంది లౌడ్‌ స్పీకర్‌తో పెద్ద సౌండ్ పెట్టి పక్కన వారిని ఇబ్బంది పెడుతున్నారట.
ఇలాంటి పరిస్థితిని అరికట్టేందుకు కర్ణాటక ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Also Read: ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!

రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తు మొబైల్‌ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని ఆర్టీసీ నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: సీఎం ప‌దవి ముద్దు..ప్ర‌ధాని కుర్చీ వ‌ద్ద‌న్న గౌడ‌

గతంలో ఒకవ్యక్తి కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. బస్సులో కావాలని చేసే అనవసర శబ్ధాలపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా మొబైల్‌లో ఎక్కువ సౌండ్‌ పెట్టి పాటలు, వీడియోలను ప్లే చేసే వారిని కట్టడి చేయాలని పిటిషనర్‌ కోరారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని డ్రైవర్‌, కండక్టర్‌ ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది.

ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది.