Hair Stolen: అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ల.. చివరకు వెంట్రుకలు కూడా దొంగతనానికి అర్హమైనవే అని ఆ పరమ వెరైటీ దొంగలు నిరూపించారు. వాళ్లు భారీ ఎత్తున జుట్టు వెంట్రుకలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.1 కోటి దాకా ఉంటుందట. వివరాలివీ..
Also Read :Shresta Iyer: ఐటమ్ సాంగ్‌తో మెరుపులు.. శ్రేయస్ అయ్యర్ సోదరి వివరాలివీ
చైనా, బర్మా, హాంకాంగ్‌లకు
ప్రతీ దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే మనిషి జుట్టుకు కూడా మార్కెట్‌లో ఒక ధర ఉంటుంది. వెంట్రుకలను, జుట్టును సేకరించే వారు మనకు స్థానికంగా కనిపిస్తుంటారు. అలాంటి వాళ్లంతా హోల్‌సేల్ వ్యాపారులకు పెద్ద మొత్తంలో జుట్టును అమ్ముతుంటారు. ఈ జుట్టును మన దేశం నుంచి చైనా, బర్మా, హాంకాంగ్ వంటి దేశాలకు సప్లై చేస్తుంటారు. ఆయా దేశాల్లో ఈ జుట్టుతో విగ్గులను తయారు చేస్తారు. ఇక్కడి వరకు బిజినెస్ యాంగిల్ ఉంది. ఇక ఇటీవలే బెంగళూరులో జరిగిన జుట్టు చోరీ వ్యవహారం గురించి తెలుసుకుందాం..
Also Read :YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వాచ్‌మన్ రంగన్న మరణంపై భార్య సంచలన కామెంట్స్
సీసీటీవీ ఫుటేజీలోని ఆధారాలివీ..
బెంగళూరు నగరంలోని ఒక గోదాంలో నిల్వ ఉంచిన మనుషుల జుట్టును ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఫిబ్రవరి 28న దొంగలు ప్రత్యేక ఎస్‌యూవీ వాహనంలో వచ్చి, 27 సంచుల్లోని జుట్టు స్టాక్‌ను ఎత్తుకుపోయారు. సీసీటీవీ ఫుటేజీ(Hair Stolen) ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ గోదాం నుంచి జుట్టు స్టాక్‌ను చైనాకు ఎగుమతి చేసేందుకు వ్యాపారి కె.వెంకట స్వామి (73) సిద్ధమయ్యారు. సరిగ్గా ఇలాంటి సమయంలో సరుకును దొంగలు ఎత్తుకెళ్లడంతో.. ఇది తెలిసిన వారు చేసిన పనే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు తెలుగులో మాట్లాడుకున్నట్టుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. రాడ్లతో కొట్టి గోదాం షట్టర్‌ను తెరిచి, అందులోని జుట్టు బ్యాగ్‌లను వాహనంలో వేసుకున్నారు.