కావేరిపై `డీకే ` మార్క్ పాద‌యాత్ర‌

తెలంగాణ బీజేపీకి హుజురాబాద్ ఫ‌లితం ఊత్సాహాన్ని నింపిన విధంగా క‌ర్నాట‌కలోని హంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో గెలుపు అక్క‌డి కాంగ్రెస్ పార్టీకి స‌మ‌రోత్సాహాన్ని నింపింది.

  • Written By:
  • Publish Date - November 13, 2021 / 03:38 PM IST

తెలంగాణ బీజేపీకి హుజురాబాద్ ఫ‌లితం ఊత్సాహాన్ని నింపిన విధంగా క‌ర్నాట‌కలోని హంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో గెలుపు అక్క‌డి కాంగ్రెస్ పార్టీకి స‌మ‌రోత్సాహాన్ని నింపింది. ఇదే టెంపోతో వ‌చ్చే అసెంబ్లీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల దిశ‌గా పార్టీని తీసుకెళ్లాల‌ని క‌ర్నాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ ప్లాన్ చేశాడు. కావేరి న‌దిపై మేకేదాటు ప్రాజెక్టు సాధ‌న కోసం పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించాడు.డిసెంబర్ మొదటి వారంలో 100 కి.మీలకు పైగా పాదయాత్ర సాగనుంది. మేకేదాటు నుంచి పాదయాత్ర ప్రారంభించి బెంగళూరు వైపు నడిచేలా బ్లూప్రింట్ సిద్ధం అయింది. `మా భూమిలో, మా డబ్బుతో, కావేరీ జలాల్లో మా వాటాను నిల్వ చేసుకునేందుకు మేకేదాటును నిర్మించాలి.` అనే నినాదంతో ముందుకు వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశాడు. ఈ ప్రాజెక్టు చాలా కాలంగా త‌మిళానాడు, క‌ర్నాట‌క మ‌ధ్య జ‌ల వివాదం రూపంలో పెండింగ్ లో ఉంది. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ హామీ ఇవ్వ‌డంతో పాటు రాష్ట్రాన్ని రెండు అంకెల వృద్ధికి తీసుకెళ‌తామ‌ని మేనిఫెస్టోలో పెట్టారు. త‌ద్భిన్నంగా బీజేపీ ప్రభుత్వం వ్య‌వ‌హ‌రింస్తోంద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

Also Read :  ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!

క‌ర్నాట‌క రాష్ట్రానికి తాగునీటి స‌ర‌ఫ‌రా కోసం మేకేదాటు ప్రాజెక్టును కావేరి న‌దిపై నిర్మించాల‌ని నివేదిక రూపొందించారు. ఆ మేర‌కు రూ. 9వేల కోట్లతో ప్రతిపాదిత నివేదిక‌ల‌ను త‌యారు చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై త‌మిళానాడు ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. దీంతో కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి ఇంకా ఆమోదం క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి రాలేదు. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం పాదయాత్రకు పూనుకోవ‌డం గ‌మ‌నార్హం.క‌ర్నాట‌క సీఎంగా సిద్ధరామయ్య ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేకేదాటు ప్రాజెక్టుకు ‘సూత్రప్రాయంగా’ ఆమోదం లభించింది. ఈ ఏడాది ఆగస్టులో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కర్ణాటక డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును తదుపరి అంచనాకు తీసుకోలేమని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం కర్ణాటకకు ఇతర నదీ తీర రాష్ట్రాల సమ్మతి అవసరమని చెప్పారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప ల‌పై కాంగ్రెస్, జేడీఎస్‌లు సంయుక్తంగా బీజేపీపై దాడికి దిగాయి.

Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల బీజేపీ విభాగాల‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. పార్ల‌మెంట్లో షెకావత్ స్పందిచిన త‌రువాత క‌ర్నాట‌క కాంగ్రెస్ మేకేదాటు ప్రాజెక్టును రాజ‌కీయ అస్త్రంగా మ‌లుచుకుంది. ఒకానొక స‌మ‌యంలో కర్ణాటక మరియు తమిళనాడుకు చెందిన బిజెపి నాయకులు ప్రాజెక్ట్‌పై మాటల యుద్ధానికి దిగారు.బిజెపి తమిళనాడు విభాగం చీఫ్ అన్నామలై ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒకరోజు లాంఛనప్రాయ నిరాహార దీక్ష కూడా చేశారు, దీనిని క‌ర్నాట‌క సీఎం బొమ్మై “రాజకీయ ప్రేరేపితం అని కొట్టిపారేశాడు. కావేరి జ‌లాల మీద త‌మిళ‌నాడు, కర్నాట‌క రాష్ట్రాల మ‌ధ్య చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. రెండు రాష్ట్రాలు మంచినీటి కోసం బంద్ ల‌కు పిలుపు ఇచ్చిన సంద‌ర్భాలు అనేకం. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ చీఫ్ శివ‌కుమార్ డిసెంబ‌ర్లో చేయ‌బోవు పాద‌యాత్ర క‌ర్నాట‌క రాజ‌కీయాన్ని వేడెక్కించ‌నుంది.