కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) నాయకుడిగా ఎన్నికైన డీకే శివకుమార్‌ను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందినట్లు సమాచారం. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన అనంతరం డీకే శివకుమార్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని లేఖను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. డీకే శివకుమార్‌తో కలిసి పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. జూన్ 3న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమయం, కొత్త మంత్రివర్గంలో చోటు దక్కబోయే సభ్యుల వివరాలను కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలకనుంది. పార్టీ అధిష్ఠానం మద్దతుతో ఆయన రాష్ట్ర పాలనలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు
Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) నాయకుడిగా ఎన్నికైన డీకే శివకుమార్‌ను రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ఆహ్వానం అందినట్లు సమాచారం. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన అనంతరం డీకే శివకుమార్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని లేఖను ఇచ్చారు. […]

Dk Shivakumar
Last Updated: 30 May 2026, 08:00 PM IST