Tamil Nadu BSP Chief : తమిళనాడులో దారుణం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆరుగురు దుండుగులు మర్డర్ చేశారు. చెన్నై నగరంలోని పెరంబూర్ ఏరియా సదయప్పన్ స్ట్రీట్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ ఇల్లు ఉంది. బైక్స్‌పై ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ఆరుగురు దుండగులు.. వేగంగా లోపలికి ప్రవేశించి ఆర్మ్‌స్ట్రాంగ్‌పై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
We’re now on WhatsApp. Click to Join
రక్తపు మడుగులో పడి ఉన్న Armstrongను హుటాహుటిన థౌజండ్ లైట్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో(Tamil Nadu BSP Chief) పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారని సమాచారం. దీనిపై సెంబియం ఏరియా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read :Mohammed Siraj : సిరాజ్ కు ఘనస్వాగతం పలికిన హైదరాబాద్ అభిమానులు
ఈ దాడిలో పాల్గొన్న దుండగుల్లో నలుగురు ఫుడ్ డెలివరీ ఏజెంట్ల యూనిఫామ్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆర్మ్ స్ట్రాంగ్ ఇల్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన దుండగుల ముఖాలను గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. సదయప్పన్ స్ట్రీట్‌లో నిర్మాణదశలో ఉన్న తన ఇంటిని చూసుకునేందుకు శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆర్మ్ స్ట్రాంగ్ చేరుకున్నారు. ఆయన అక్కడికి వెళ్లిన కాసేపటికే.. ఆరుగురు దుండగులు బైక్‌లపై వచ్చి హత్యకు పాల్పడటం గమనార్హం. ఆర్మ్ స్ట్రాంగ్ గతంలో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్‌గా పనిచేశారు. తమిళనాడులో పెరిగిపోతున్న హింసకు ఈ ఘటన నిదర్శనమని రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ మృతికి ఆయన సంతాపం తెలిపారు. సీఎం పదవిలో కొనసాగే అర్హత ఇంకా ఉందా లేదా అనేది స్టాలిన్ ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు హత్యకు గురికావడం అంటే మామూలు విషయం కాదని అన్నా డీఎంకే నేత పళని స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్ధకంగా మారాయన్నారు. కనీసం ఆర్మ్ స్ట్రాంగ్ అంత్యక్రియలైనా శాంతియుతంగా జరిగేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.