తమిళనాడు రాజకీయ వర్గాలు, సినీ రంగాన్ని కుదిపేసేలా బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, రాష్ట్ర బీజేపీ కార్యాలయంతో పాటు ప్రముఖ నటి త్రిష ఇంటికి కూడా ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు, భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.
Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే!
బెదిరింపు కాల్స్ అందుకున్న వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రతి ప్రదేశాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలు ఎక్కడా దొరక్కపోవడంతో ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. అయినప్పటికీ ఏవైనా అనూహ్య పరిణామాలు జరగకుండా చెన్నై అల్వార్పేటలోని సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే గవర్నర్ భవనం, బీజేపీ కార్యాలయం, నటి త్రిష ఇంటి వద్ద కూడా అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సాంకేతిక సహకారంతో ఈ నంబర్‌కి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా విచారించి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇలాంటి ఫేక్ కాల్స్ వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నందున భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.
