Site icon HashtagU Telugu

New Political Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత సన్నిహితుడి స్కెచ్

New Political Party In Tamil Nadu Panneerselvam Ops Tamil Politics Min

New Political Party:  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపైనే అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఉంది. హీరో విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన జనసేన పార్టీ తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని బహిరంగ సభలు వేదికగా పలుమార్లు విజయ్ కుండబద్దలు కొట్టారు. తద్వారా తాను ఏ క్షణంలో ఎవరితోనైనా జతకట్టే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలితకు సన్నిహితుడిగా ఒకప్పుడు వెలుగు వెలిగిన పన్నీర్ సెల్వం సైతం సైలెంటుగా ఎన్నికల కోసం స్కెచ్ రెడీ చేస్తున్నారు.

Also Read :New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?

పళని స్వామికి సవాల్ విసిరేందుకు.. 

జయలలిత చనిపోయాక ఈయనను అన్నా డీఎంకే(New Political Party) నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అన్నా డీఎంకేపై పూర్తి కంట్రోల్ ఎడప్పాడి కె.పళనిస్వామికి ఉంది. ఆయనకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అండదండలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీతో అన్నా డీఎంకే పొత్తు కన్ఫార్మ్ అయింది. ఇదంతా గమనించిన పన్నీర్ సెల్వం .. తన అనుచర గణంతో కలిసి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారట.  పళని స్వామి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న అన్నా డీఎంకే నేతలను కూడగట్టేందుకు పన్నీర్  సెల్వం రహస్య మంతనాలు జరుపుతున్నారట. పన్నీర్  సెల్వం దేవర్ సామాజిక వర్గం నేత.  రాజకీయ పార్టీ పెడితే ఆ వర్గం నుంచి పన్నీర్ సెల్వంకు మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి.

Also Read :Rana 3 Demands : ఎన్ఐఏ ఎదుట తహవ్వుర్ రాణా 3 డిమాండ్లు

కొత్త పార్టీ రిజిస్ట్రేషన్.. డీఎంకేతో దోస్తీ ? 

పన్నీర్  సెల్వంను బీజేపీలో చేర్చుకోవద్దని.. ఒకవేళ చేర్చుకుంటే తమ పార్టీ(అన్నా డీఎంకే)తో పొత్తు కొనసాగదని అమిత్‌షా, మోడీలకు పళని స్వామి స్పష్టం చేశారట. అందుకే బీజేపీ వైపు నుంచి పన్నీర్ సెల్వంకు తలుపులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టుకొని.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసే మార్గం ఒక్కటే ఆయనకు మిగిలింది. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని డీఎంకే సర్కారుపై పన్నీర్ సెల్వం  ఘాటు విమర్శలు చేయడం లేదట. ఏ విషయంలోనైనా సరే.. సాఫ్ట్‌గానే ప్రశ్నిస్తున్నారట. తద్వారా భవిష్యత్తులో డీఎంకేకు దగ్గరయ్యే అవకాశాలను కాపాడుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఢిల్లీలో బిజీగా ఉన్నారట.