Site icon HashtagU Telugu

AP : పైశాచికానందం….భార్యతో కలిసున్న ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన భర్త…!!

Sexual Abuse

Sexual Abuse

భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడో ఓ ప్రబుద్దుడు. దీంతో అడ్డంగా బుక్కాయ్యాడు. తన బెడ్రూం కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడమే కాకుండా…వాటిని ఇతరులకు పంపించి పైశాచికానందం పొందాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అతను ఒకరి తెలియకుండా ఒకరిని మొత్తం నలుగురిని వివాహం చేసుకున్నట్లు తెలింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జరిగింది.

బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…డుంబ్రిగూడ మండలం చెలిమరవలస గ్రామానికి చెందిన దామోదర్ పాడేరులో నివాసం ఉంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరికొరితో మొత్తం నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు భార్యలను వేరు వేరుగా కాపురం ఉంచాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఉండేవాడు. అతడి మాయమాటలు నమ్మిన భార్యలు తన భర్త మంచివాడని నమ్మారు.

అయితే తన నాలుగో భార్యతో కలిసి ఉన్న ఫొటోలను స్నేహితులకు పంపించాడు. వారు ఇతరులకు పంపించాడు. ఈ వీడియోలు చివరికి భార్యకు చేరాయి. భర్త చేసిన నీచపు పనిగురించి తెలిసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కట్టుకున్న భార్య వీడియోలను నలుగురికి పంపించిన దామోదర్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు.

Exit mobile version