Viral Video: ఖడ్గమృగం బిడ్డకు జన్మనిచ్చే అరుదైన వీడియో వైరల్​

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలకు ఉండే క్రేజ్​ అంతాఇంతా కాదు. ఆ వీడియోలు నెటిజన్ల మనసులను హత్తుకుంటాయి.

  • Written By:
  • Publish Date - December 20, 2022 / 11:20 PM IST

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలకు ఉండే క్రేజ్​ అంతాఇంతా కాదు. ఆ వీడియోలు నెటిజన్ల మనసులను హత్తుకుంటాయి.  అదే ఏదైనా అడవి జంతువు తన బిడ్డకు జన్మనిచ్చే వీడియో అయితే..? దానిని వైరల్ చేసే వరకు నెటిజన్లు వదిలిపెట్టరు .

ఎందుకంటే అవి మనసుకు అంతగా నచ్చుతాయి. కంటి చూపును కట్టి పడేస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఓ ఖడ్గమృగం తన బిడ్డకు జన్మనిచ్చే అరుదైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేసిన ఈ వీడియో మొదట ‘వైల్డ్‌ఫ్రెండ్స్ ఆఫ్రికా’ అనే  ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చేసింది.

“ఇలాంటి విలువైన క్షణాలను చూడటం చాలా అరుదు. 16 నుంచి 18 నెలల గర్భధారణ తర్వాత, మరో కొత్త జీవితం’’ అంటూ సుధా రామెన్ తన పోస్ట్‌కు చక్కటి క్యాప్షన్ రాసుకొచ్చారు. వీడియోలోని అరుదైన దృశ్యం ఇంటర్నెట్‌ని మంత్రముగ్ధులను చేసింది. “ఇలాంటి సందర్భాలు కనిపించడం చాలా అరుదు”అని ఓ నెటిజన్ రాయగా..  “నిజంగా అందమైన క్షణం. తల్లి, పిల్ల సుదీర్ఘమైన ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను” అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు లక్షకుపైగా వ్యూస్​ వచ్చాయి.