Tractor Accident: డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన ట్రాక్టర్, చక్కర్లు కొడుతున్న వీడియో!

డ్రైవర్ లేకుండా ఓ ట్రాక్టర్ దూసుకెళ్లిపోయింది. ఓ షాపులోకి వెళ్లడంతో అద్దాలు, బైక్ ధ్వంసమయ్యాయి.

  • Written By:
  • Updated On - March 4, 2023 / 03:34 PM IST

ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బిజ్నోర్‌లోని ఒక షోరూమ్‌లోకి ట్రాక్టర్ (Tractor) దానంతట అదే స్టార్ట్ ఓ షాపులోకి దూసుకుపోయింది. దీంతో షాపు (Shop) అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో (Video)ను చూసిన నెటిజన్స్ ట్రాక్టర్‌లో దెయ్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ (Tractor)  బైక్‌ను ఢీకొట్టడంతో పాటు సైకిల్‌ను తునతునకలు చేసింది. సకాలంలో స్పందించిన ఓ వ్యక్తి బ్రేక్ వైర్స్ కట్ చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఓ వ్యక్తి ట్రాక్టర్‌ (Tractor)పై వచ్చి తన వాహనాన్ని చెప్పుల దుకాణం బయట పార్క్ చేశాడు. అయితే సుమారు గంటసేపు ఆ స్థలంలో నిశ్చలంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ షాపులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని షాప్ మేనేజర్ ట్రక్కు యజమానిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Dog Bite Cases: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. రోజుకు 100 కేసులు!