Site icon HashtagU Telugu

MLA Video: టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

Viral

Viral

బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. మంచిర్యాల నుంచి బెల్లంపల్లిలోని నివాసానికి తన వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో మందమర్రి టోల్‌ప్లాజాలో మూసివున్న గేటు వద్ద ఆయన వాహనం నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం ఎమ్మెల్యే (BRS MLA) అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరిని చెంపపై కొట్టిన దృశ్యం చక్కర్లు కొడుతోంది.

20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లేందుకు సిబ్బంది రూ.150 అడిగారని ఆరోపిస్తూ, టోల్ గురించి తెలుసుకోవడానికి మేనేజర్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నానని ఆయన అన్నారు. ఆరోపణలపై స్పందించిన చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై తాను దాడి చేయలేదని అన్నారు. తన ప్రశ్నకు సిబ్బంది స్పందించలేదని ఎమ్మెల్యే (BRS MLA) తెలిపారు. సోమగూడెంలో జాతీయ రహదారి, ఫ్లైఓవర్ పూర్తి చేయకుండానే టోల్ ప్లాజా యాజమాన్యం ఫీజులు వసూలు చేయడం ప్రారంభించిందని చిన్నయ్య అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే అంబులెన్సుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: BTech Girls: బీటెక్ అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్.. ఆ పై బ్లాక్ మెయిల్!