Site icon HashtagU Telugu

UP : మేనకోడలిపై అత్యాచారం…వీడియోను వాట్సాప్ లో షేర్ చేసిన నిందితుడు.!!

crime

crime

యూపీలోని బందా జిల్లాలో అవమానకర ఘటన చోటుచేసుకుంది. సొంత మేనకోడలిపైన్నే అత్యాచారం చేశాడ మేనమామ. అంతటితో ఊరుకోలేదు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసి దాన్ని వాట్సాప్ కుటుంబ సభ్యులకు షేర్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేనమామ తనపై అత్యాచారం చేశాడని బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం ఇదే జిల్లలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇద్దురు యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు మొబైల్లో అసభ్యకర వీడియోలు తీసి బయటకు చెబితే వీడియోలు వైరల్ చేస్తామంటూ బాధితురాలిని భయపెట్టారు. మరో ఘటనలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు ఓ యువకుడు. ఉత్తరప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు భయాందోళనను కలిగిస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా…ఇలాంటి ఘటనలు ఆగడం లేదు.

Exit mobile version