Division Of Husband : బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన ఒక భర్త, ఇద్దరు భార్యల వెరైటీ స్టోరీ ఇది. మొదటి భార్యకు చెప్పకుండానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది ? చివరగా ఆ భర్త తీసుకున్న విచిత్రమైన నిర్ణయం ఏమిటి ? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Cognizant VS Infosys : ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ
ఓ భర్త , ఇద్దరు భార్యలు..
- శంకర్ సాహ్‌కు 2000 సంవత్సరంలో పూనమ్(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
- వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
- ఏడేళ్ల క్రితం పూనమ్, శంకర్ సాహ్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఉషాదేవి అనే మహిళతో శంకర్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
- శంకర్ రెండో పెళ్లి విషయం ఇటీవలే పూనమ్‌కు తెలిసింది.
- దీంతో ఆమె పూర్ణియా జిల్లా ఎస్పీ కార్తికేయ శర్మను ఫిర్యాదు చేశారు.
- తమకు 22 ఏళ్లు, 18 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎస్పీకి పూనమ్ చెప్పింది.
- తనకు చెప్పకుండా భర్త శంకర్ రెండో మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపించింది.
- తనకు ఇంటి ఖర్చులు ఇవ్వడం లేదని పూనమ్ తెలిపింది.
- చివరకు ఈ ఫ్యామిలీ వివాదం పూర్ణియా జిల్లా కేంద్రంలోని పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరింది.
- అక్కడ శంకర్ సాహ్, పూనమ్, ఉషాదేవిలకు కౌన్సెలింగ్ చేశారు.
- పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం శంకర్ సాహ్ కీలక ప్రకటన చేశాడు. వారంలో నాలుగు రోజులు మొదటి భార్యతో, మూడు రోజులు రెండో భార్యతో ఉంటానంటూ బాండ్ రాసిచ్చాడు.
- మొదటి భార్య ఇద్దరు పిల్లలకు ప్రతినెలా రూ.4వేలు ఖర్చులకు ఇస్తానని హామీ ఇచ్చాడు.
- శంకర్ ప్రతిపాదనలకు భార్యలు పూనమ్, ఉషాదేవి అంగీకరిస్తూ బాండ్‌పై సంతకాలు చేశారు.
- మొత్తం మీద ఈ ఫ్యామిలీ వివాదానికి ఒక వెరైటీ శాంతియుత పరిష్కారం లభించింది.