Flower Seller : ఐఫోన్ కొనాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆ అబ్బాయి కూడా అందరిలాగే ఐఫోన్ కొనాలని అనుకున్నాడు. ఈవిషయాన్ని గుడి దగ్గర పూలు అమ్ముకునే తన తల్లికి చెప్పాడు. అయితే అంత స్థోమత తనకు లేదని ఆమె చెప్పింది. దీంతో ఆ కుమారుడు మూడు రోజులు అన్నం తినకుండా మారాం చేశాడు. తనకు ఐఫోన్ కొనిస్తేనే అన్నం తింటానని మొండిపట్టుకు పోయాడు. దీంతో ఆ తల్లి బయట అప్పులు తెచ్చి మరీ తన కొడుకుకు కొత్త ఐఫోన్‌ను కొనిచ్చింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఆ వీడియోలో ఒక మహిళ, ఆమె కొడుకు(Flower Seller) మొబైల్ షాపులో డబ్బుల కట్ట పట్టుకొని నిలబడి ఉన్నారు. ‘‘ఐ ఫోన్‌ను కొనడానికి మీరు ఏమేం చేశారు’’ అని ఆ అబ్బాయిని అడగగా.. ‘‘మా అమ్మే ఆ డబ్బు ఇచ్చింది’’ అని చెప్పాడు. ఆ అబ్బాయి తల్లితో మాట్లాడగా.. ‘‘నేను ఒక గుడిబయట పువ్వులు అమ్ముతాను. నా కొడుకు ఐ ఫోన్ కోసం 3 రోజులుగా ఏమీ తినలేదు. చివరికి తన పంతాన్నే నెగ్గించుకున్నాడు. నేను అప్పు చేసి ఐఫోన్ కోసం డబ్బులు తెచ్చి ఇచ్చాను’’ అని వివరించింది. వాళ్లిద్దరితో మాట్లాడిన వ్యక్తి ఐఫోన్ చేతికి ఇచ్చి వారితో దాని బాక్సును ఓపెన్ చేయించాడు. గిఫ్టుగా ఒక బ్లూ టూత్ హెడ్ సెట్‌ను కూడా ఇచ్చాడు.
Also Read :Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
అప్పులు చేసి మరీ ఐఫోన్లు కొంటున్న ఈ కాలపు ట్రెండ్‌కు పైన మనం చెప్పుకుంటున్న ఘటన పెద్ద ఉదాహరణ. జేబులో రూపాయి లేకపోయినా కొండన్ని ఆశలు పెట్టుకోవడం ఆపేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తొలుత జీవితాలను ఆర్థికంగా, నైపుణ్యపరంగా బలోపేతం చేసుకుంటే డెవలప్‌మెంట్ అనేది దానంతట అదిగానే వచ్చేస్తుందని చెబుతున్నారు. ఒకసారి ఆర్థికంగా ప్రగతిని నమోదు చేస్తే అన్ని కోరికలను తీర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం, ఖర్చులు, పొదుపు అనే అంశాలపై ఫోకస్ చేస్తూ సాదాసీదా జీవితం సాగించడంలోనే మజా ఉంటుందని అంటున్నారు.