Site icon HashtagU Telugu

Elon Musk : నేను సెక్స్ చేసి కొన్నేళ్లయ్యింది.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!!

Elon Imresizer

Elon Imresizer

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను రోజుకో కొత్త వివాదం చుట్టుముడుతోంది. సెక్స్ ఎఫైర్స్ చుట్టుముడుతున్న తరుణంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. చాలా ఏళ్లుగా తాను ఎవరితోనూ సెక్స్ చేయలేదని వెల్లడించారు. కనీసం వెకేషన్స్ సమయంలో కూడా సెక్స్ చేసే తీరిక కొంత కాలంగా తనకు లేదని తేల్చి చెప్పారు. ఇటీవల వెల్లువెత్తిన ఆరోపణలు, మీడియా కథనాల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.. పూర్వపరాల్లోకి వెళితే..

గూగుల్ సహ-వ్యవస్థాపకుడి సతీమణి..

గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సతీమణి నికోలే షనాహన్‌ తో ఆయనకు అఫైర్ ఉందంటూవాల్‌స్ట్రీట్ జర్నల్ లో ఇటీవల కథనం వచ్చింది. దీనిపై మస్క్ వెంటనే స్పందించి.. ఇదంతా బుద్ధిలేని ప్రచారమని, అవాస్తవమని కొట్టిపారేశారు. ” సెర్గీ బ్రిన్, నేనూ స్నేహితులం. నికోలేని మూడేళ్ల వ్యవధిలో 2 సార్లు మాత్రమే చూశాను. ఆ రెండు సందర్భాల్లోనూ చాలామంది అక్కడున్నారు. రోమాంటిక్‌ పనులకు ఆస్కారమే లేదు” అని మస్క్ తేల్చిచెప్పారు. గతంలోనూ ఎలాన్ మస్క్ పై ఇలాంటి ఆరోపనలే రాగా, ఆయన ఖండించారు.

ఓ ఉద్యోగి ద్వారా ఇద్దరు పిల్లలు ?

51 ఏళ్ల ఎలాన్‌ మస్క్‌ తన సంస్థ ‘న్యూరాలింక్‌’లో పనిచేస్తున్న 36 ఏళ్ల ఉద్యోగి శివోన్ జిలిస్ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తండ్రయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. శివోన్‌ జిలిస్‌ తో కలిసి 2021 నవంబర్‌లో ఆయన కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్‌, శివోన్ జిలిస్‌ కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌‌ 25న పిల్లల పేరు మార్పు అంశంపై కోర్టును ఆశ్రయించారు. తమ పేర్లలోని చివరి పదాన్ని పిల్లల పేర్లలో ఉండేలా మార్చుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సంబంధించి పత్రాల ద్వారా ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన విషయం వెలుగులోకి వచ్చిందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది. ప్రస్తుతం శివోన్ జిలిస్‌ న్యూరాలింక్‌లో ‘ఆపరేషన్స్‌ అండ్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌’ డైరెక్టర్‌గా ఉన్నారని తెలిపింది.మస్క్‌ స్థాపించిన మరో సంస్థ OpenAI లోనూ శివోన్ జిలిస్‌ బోర్డు సభ్యురాలిగా ఉన్నారని కథనంలో ప్రస్తావించింది.

మొత్తం 9 మంది పిల్లలు..

కెనడా సింగర్‌ గ్రైమ్స్‌తో ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పొందారు. తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. గతేడాది డిసెంబరులో ఎలాన్ మస్క్‌, గ్రైమ్స్‌ కలిసి సరోగసీ ద్వారా తమ రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు. అయితే, ప్రస్తుతం వీరివురు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.శివోన్ జిలిస్‌ వల్ల ఇటీవల కలిగిన ఇద్దరు పిల్లలను కలుపుకుంటే.. ఎలాన్ మస్క్
మొత్తం 9 మంది పిల్లల తండ్రి అయ్యాడు.