Site icon HashtagU Telugu

Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

bride video

Viral

సాధారణంగా పెళ్లి కూతుళ్లు (Brides) ఖరీదైన కారులో లేదా రంగురంగుల పూలతో డిజైన్ చేసిన పల్లకీలో ఎక్కి అందంగా ముస్తాబై పెళ్లి (Marriage) మండపానికి చేరుకుంటారు. కానీ ఈ ఫొటోలో కనిపించే నవ వధువు (Bride) మాత్రం ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా స్టేజీ వద్దకు చేరుకుంది. ఇండియాలో (India) పలు మెట్రో సిటీల్లో ట్రాఫిక్ జామ్ కామన్. ఇక బెంగళూరు (Bengaluru) లాంటి సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజలు కూడా ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో బెంగళూరు టౌన్ కు చెందిన ఓ యువతికి పెళ్లి కుదురుతుంది.

ఇరు పెద్దల మేరకు పెళ్లికి ముహుర్తం పెట్టుకుంటారు. అయితే వరుడు, వాళ్ల బంధువులు సకాలంలో మండపానికి వచ్చినా.. పెళ్లి కూతురు (Bride) కి సాధ్యంకాలేదు. తీవ్ర ట్రాఫిక్ కారణంగా కారులోనే ఉండిపోయింది. అయితే ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి మెట్రో ట్రైన్ (Metro Train) ఎక్కి సకాలంలో పెళ్లి మండపానికి చేరుకుంది. పెళ్లి దుస్తుల్లో కనిపించిన వధువుని చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కానీ అమ్మాయి తెలివికి హాట్సాఫ్ కు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతోంది. వీడియో ఇప్పటికే 9800+ వ్యూస్ సాధించింది.

Also Read: Samantha in Mumbai: ముంబైలో సమంత.. కొత్త లుక్ లో అదుర్స్!