Health Tips : వర్షాకాలంలో అంటువ్యాధుల భయం ఎక్కువ. జలుబు, ఫ్లూ, వైరల్ జ్వరాలు, గొంతులో నొప్పి, దగ్గు, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వచ్చేది ఈ సీజన్‌లోనే. వాతావరణ మార్పుల వల్ల ఈ ఇన్ఫెక్షన్లు ఈజీగా వ్యాపిస్తుంటాయి. వీటి నుంచి త్వరగా కోలుకునేందుకు చాలా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని వస్తువులను రెడీగా ఉంచుకుంటే వర్షాకాలంలో అంటువ్యాధుల బారి నుంచి ఈజీగా బయటపడొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వారి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- పసుపు దివ్యమైన ఆయుర్వేద ఔషధం(Health Tips). దానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కొందరు కడుపులో మంట సమస్యతో బాధపడుతుంటారు. మరికొందరికి కీళ్ల నొప్పులు ఉంటాయి. ఇంకొందరు కడుపు నొప్పి, జలుబుతో సతమతం అవుతుంటారు. ఇలాంటి వారు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగాలి. దీనివల్ల ఆయా వ్యాధులు నయం అవుతాయి.
- జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురైన వారు ఉసిరి జ్యూస్ తాగొచ్చు. లేదంటే వాటిని తినొచ్చు. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నాయి. విటమిన్ సీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. ఉసిరిని తింటే మన శరీరంలో మరిన్ని కొత్త తెల్ల రక్త కణాలు ఏర్పడతాయి.
Also Read :School Holidays : హాలిడేస్ క్యూ.. విద్యార్థులకు వచ్చేవారం వరుస సెలవులు
- ప్లూ, జలుబు ఉన్నవారు అవిసెగింజలు తినొచ్చు. వీటిలో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చిన వారు కూడా అవిసెలు వాడొచ్చు. ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను ఉడకబెట్టి ఆ నీళ్లను తాగితే మంచిది.
- జలుబు, దగ్గు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్‌లు కలిగినవారు తులసి ఆకులు తినాలి. వాటి వల్ల ఇన్ఫెక్షన్‌లతో పోరాడే శక్తి వస్తుంది. తులసి ఆకులు మన శరీరంలో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మనకు సీజనల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
- ఫ్లూ, జలుబుతో సతమతం అవుతున్నవారు అల్లం టీ తాగాలి. అల్లంలో షోగోల్స్, జింజెరాల్స్ వంటి ఔషధ సమ్మేళనాలు ఉన్నాయి. టీ తాగనివారు అల్లం ముక్కలను వేడినీటిలో వేసుకుని తాగొచ్చు.
Also Read :RTC : ఆర్టీసీలో త్వరలో ఆ బస్సులు.. ఎవరైనా టికెట్ కొనాల్సిందే
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.