Ikea Marriage Test : ఇటీవలి కాలంలో చాలామంది పెళ్లయిన కొన్నేళ్లకే జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకుంటున్నారు. జీవిత భాగస్వామిలోని నెగెటివ్ కోణాలను భూతద్దంలో చూస్తున్నందు వల్లే ఈ పరిస్థితి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. మ్యారేజ్ తర్వాత అంతా హ్యాపీగా, కంఫర్ట్‌గా సాగుతుందనే అపోహ కూడా విడాకులకు పెద్ద కారణంగా మారుతోంది. జీవితంలో ఆటుపోట్లు, కష్టనష్టాలు, సాధకబాధకాలు ఉంటాయనేది ముందే తెలుసుకొని ఉంటే.. విడాకులకు మొగ్గుచూపే వారి సంఖ్య తగ్గిపోతుందని సామాజికవేత్తలు అంటున్నారు. ఈ అంశాలను మ్యారేజ్ చేయడానికి ముందే తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. జీవన ప్రస్థానంలో ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలను బ్యాలెన్స్‌డ్‌గా పరిగణనలోకి తీసుకొని ముందు సాగాలని పిల్లలకు పేరెంట్స్ సూచించాలి. ఈ హితబోధ సరిగ్గా, అర్ధవంతంగా జరిగితే మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. ఇక మనం ‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’ విషయమేంటో తెలుసుకుందాం..
Also Read :Beard Style Vs Personality : ఒక్కో గడ్డం.. ఒక్కో సంకేతం.. ఒక్కో సందేశం..
‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’.. ఏమిటిది ?
- ‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’(Ikea Marriage Test)తో మీ పార్ట్నర్ మీకు సెట్ అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు. పెళ్లి చేసుకోబోతున్న జంటలు ఈ టెస్ట్‌లో పాల్గొనొచ్చు.
- ఈ టెస్ట్ చాలా ఈజీ. పెళ్లికి ముందు జంటలు ఐకియాకు వెళ్లి, ఫర్నీచర్ పీసెస్‌ని కొని, వాటిని కలిపి ఫిక్స్ చేయాలి.
- ఫర్నీచర్ పీసెస్‌ను కలిపి ఫిక్స్ చేసే క్రమంలో ఇద్దరూ ఎలా వ్యవహరిస్తారు ? ఏవిధమైన ప్రవర్తనను కనబరుస్తారు ? అనేది ఈ టెస్ట్‌లో కీలక అంశం.
- ఫర్నీచర్ పీసెస్‌ను అతికే క్రమంలో ఇద్దరూ గొడవలకు దిగకూడదు. ఒక టీమ్‌లాగా కలిసి పనిచేయాలి. తద్వారా వేగంగా ఫర్నీచర్ పీస్‌లను అతకగలరు.
- ఫర్నీచర్ పీసెస్‌ను అతికే క్రమంలో..ఒకరి ఆలోచనను మరొకరు అర్థం చేసుకోగలగాలి. అంచనా వేయగలగాలి. తద్వారా అర్ధవంతంగా, సమన్వయంతో వ్యవహరించే జీవన శైలి అలవడుతుంది.
- డబ్బులు ఖర్చు పెట్టి ఐకియాలో ఫర్నీచర్‌ను కొనొద్దని భావించే వారి కోసం ఒక ఐడియా ఉందట. వారు ఒక చిన్న పడవ తీసుకుని చెరువులో అడ్వెంచర్‌కి వెళ్లి రావచ్చు. అందులో సవాళ్లను అధిగమిస్తే ఇద్దరి మధ్య అన్యోన్యత కుదిరినట్టు.
- ఈ టెస్ట్ గురించి ప్రతిపాదన చేసిన వ్యక్తి పేరు సాహిల్ బ్లూమ్. ఈయన మాజీ ఫైనాన్స్ ప్రొఫెషనల్. ఎకనామిక్స్, సోషియాలజీలో డబుల్ మేజర్‌తో స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.