ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వయసు (Age) పెరిగినా యవ్వనంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. కాస్టలీ క్రీములు, ఇంజెక్షన్లు కాకుండా సహజమైన సప్లిమెంట్లతో కూడా వయసు ను తగ్గించుకోవచ్చు. అవిసె గింజల నూనె, శతావరి, అశ్వగంధ, ఉసిరి, పసుపు వంటి మూలికలు సహజంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వయసు సంకేతాలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
Sand Mafia : పిఠాపురంలో ఇసుక మాఫియా..గర్జించిన వర్మ
ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే అవిసె గింజల నూనె చర్మానికి తేమను అందించి ముడతలను తగ్గిస్తుంది. అలాగే ‘మూలికల రాణి’గా పేరుగాంచిన శతావరి హార్మోన్ల సమతుల్యతను కాపాడి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది. మరోవైపు, అశ్వగంధ అనేది ఒత్తిడిని తగ్గించి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచే శక్తి కలిగిన మూలిక. ఇది ముడతలు, చర్మ దురద, జుట్టు రాలే సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
విటమిన్ C సమృద్ధిగా ఉండే ఉసిరి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మెరిసేలా చేస్తుంది. ఇది వయసుతో వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించి సెల్యులార్ నష్టాన్ని నివారిస్తుంది. అలాగే, పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి చర్మానికి ముడతలు రాకుండా చేస్తుంది. ఈ సహజ సప్లిమెంట్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే, వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.