Site icon HashtagU Telugu

Diet Soda Drinks : ‘డైట్ సోడా’ అతిగా తాగారో.. ఎంతో రిస్క్!

Diet Soda Drinks

Diet Soda Drinks

Diet Soda Drinks : డైట్ సోడాలు.. వీటిలో  జీరోషుగర్, జీరో క్యాలరీ ఉంటుంది. ఇవి కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు !! వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, ఆందోళన, టైప్ 2 మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రాబ్లమ్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి నాన్ షుగర్ స్వీటెనర్‌లను ఉపయోగించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మార్చిలో కొత్త మార్గదర్శకం జారీ చేసింది. డైట్ సోడాలు శరీర కొవ్వు, రక్తపోటు స్థాయులను పెంచేస్తాయని ఇంకొన్ని పరిశోధనా నివేదికలు పేర్కొన్నాయి. డైట్ సోడాలను మితిమీరి వినియోగిస్తే వాస్కులర్ ఈవెంట్స్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని వెల్లడించాయి. డైట్ సోడాల వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాలేయంలో ఇన్సులిన్ నిరోధకత, వాపు పెరుగుతాయి.కాలేయంలో అధిక కొవ్వు చేరడం వల్ల  మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలేయ వ్యాధి ప్రపంచ జనాభాలోని 46 శాతం మందిని ప్రభావితం చేస్తోందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Hair Tips: శీతాకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?