Insomnia Problem : నిద్రలేమి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం వల్ల పగటిపూట అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది మీ దైనందిన కార్యకలాపాలతో పాటు ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని సులభమైన నియమాలు పాటిస్తే ఈ నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.
నిద్రపోయే ముందు కనీసం ఒక గంట పాటు మొబైల్ స్క్రీన్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల నుండి వెలువడే బ్లూ లైట్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనేది నిద్రను నియంత్రించే హార్మోన్. కాబట్టి, నిద్రవేళకు ముందు ఈ డిజిటల్ పరికరాలను వాడటం మానేసి, వాటి స్థానంలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఒక మంచి పుస్తకం మిమ్మల్ని ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి, మనసును తేలికపరుస్తుంది. ఇది త్వరగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.
అలాగే, నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నూనెతో తల మసాజ్ చేసుకోవడం చాలా ప్రయోజనకరం. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద నూనెలు లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల తల, మనసు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. మీ పడకగదిలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. గదిలో కాంతి, శబ్దం లేకుండా, ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే, కళ్ళు మూసుకునే ఐ మాస్క్ లేదా చెవులలో దూది పెట్టుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు.
అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు కొందరికీ టీ కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. కెఫిన్ అనేది నిద్రను దూరం చేస్తుంది. అందుకే పడుకునే ముందు పాలు తాగడం మంచింది. టీ, కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదే విధంగా కొందరికి కింద పడుకోవడం అలవాటు ఉంటుంది. మరికొందరికి బెడ్ మీద పడుకోవడం అలవాటు ఉంటుంది. ఎక్కడ పడుకునే మీ నిద్రకు భంగం కలిగించే విధంగా మీ బెడ్ ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన త్వరగా నిద్ర పోవడానికి ఆస్కారం ఉంటుంది. గదిలో సాఫ్ట్ మ్యూజిక్ లాంటిది ఏకాగ్రతకు భంగం కలగకుండా తక్కువ వాల్యూమ్‌లో పెట్టుకుని సాంగ్స్ వింటూ పడుకునే అలవాటు ఉన్న వాళ్లు కూడా ఈ టిప్ ఫాలో అవ్వొచ్చు. ఇలా చేస్తే నిద్ర బాగా పడుతుంది. తద్వారా మరుసటి రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
Shirdi Trains : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ తెలిపిన దక్షిణ మధ్య రైల్వే