మనం ఈ రోజుల్లో ఏ ఊరు వెళ్లినా లేదా ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్‌లో ఉంటాము. అయితే మనం అక్కడ హోటల్స్‌లో (Hotels) గమనిస్తే ఎక్కువగా వైట్ కలర్ బెడ్ షీట్స్ (White Bedsheets), పిల్లో కవర్స్ (Pillow Covers) వాడటం చూస్తాము. ఎందుకంటే మనం హోటల్ రూమ్స్‌లోకి ప్రయాణం చేసి వస్తాము లేదా పని మీద వస్తాము. వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వల్ల ఎంతో రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. ఇంకా హోటల్స్ వాళ్లకు వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వల్ల ఎక్కడ మురికిగా అయ్యాయో త్వరగా తెలుస్తుంది. అదే రకరకాల కలర్ బెడ్ షీట్స్ వాడితే అవి ఎక్కడ మురికి అయ్యాయో త్వరగా తెలియదు. కాబట్టి వైట్ బెడ్ షీట్స్ వాడటం వల్ల బెడ్ షీట్స్ క్లీన్ చేసి పెట్టడం హోటల్స్ వారికి తేలిక అవుతుంది.
1990 ముందు వరకు వైట్ కలర్ బెడ్ షీట్స్ ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. 1990 తరువాత ఇంటీరియర్ డిజైనర్స్ వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడమని హోటల్స్ వాళ్లకు సలహా ఇచ్చారు. అప్పటి నుండి కొన్ని హోటల్స్ వాళ్ళు వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడటం మొదలుపెట్టారు. వారిని చూసి మిగతా వాళ్ళు కూడా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడటం మొదలుపెట్టారు.
ఇప్పుడు అయితే 3 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో అతిథులు తమ ఇష్టానికి అనుగుణమైన కలర్స్ ఎంచుకొని కస్టమైజ్ చేయించుకునే అవకాశం ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల అతిథులు తమకు నచ్చినట్లుగా హోటల్స్‌లో నివసిస్తారు. ప్రస్తుతం ఇది ఇంకా ట్రయల్ ప్రాసెస్ లో ఉన్నా, 90 శాతం హోటల్స్‌లో ఇంకా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ నే వాడుతున్నారు. కావాలంటే ఈసారి హోటల్‌కి వెళ్ళినప్పుడు గమనించండి, మీకే తెలిసిపోతుంది.
