Decoding Denim: డెనిమ్ జీన్స్‌ కు అందాలు అద్దిన తారాలోకాన్ని చూసొద్దాం..

డెనిమ్ జీన్స్‌ ప్యాంట్లకు ఉన్న క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా ధరిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 02:00 PM IST

డెనిమ్ జీన్స్‌ ప్యాంట్లకు ఉన్న క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా ధరిస్తుంటారు. ఎన్నో ఈవెంట్స్ లో డెనిమ్ జీన్స్‌ ధరించి సందడి చేస్తుంటారు. దీపికా పదుకునే నుంచి ఆలియా భట్ దాకా ఎంతోమంది హీరోయిన్స్ డెనిమ్ జీన్స్‌ లో కనిపించడాన్ని మనం ఎన్నోసార్లు టీవీ స్క్రీన్ పై చూసి ఉంటాం. చినిగిపోయిన, బ్యాగీ, స్లిమ్ రకాల డెనిమ్ జీన్స్ ను ఎంతోమంది హీరోయిన్స్ ఇష్టంగా ధరిస్తుంటారు. వాటిని మీరూ ఒకసారి చూడండి. వెంటనే కొనేసి మీ బీరువాలో ఉంచుకోండి.

* ఆలియా భట్

ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ ఆలియా భట్ ఒక స్పెషల్ డెనిమ్ జీన్స్ ను ఇటీవల చాలాసార్లు ధరించారు. అది పొత్తి కడుపు పైవరకు ఉంటుంది. దీనిపై మూడు నాలుగు చోట్ల డెనిమ్ ప్యాచెస్ , ఆ ప్యాచ్ లపై ఆకట్టుకునే ఎంబ్రాయిడరీ ఉంటాయి. ఈ ప్యాంట్ కు జతగా సాలిడ్ కలర్ కలిగిన ఫుల్ షర్ట్ ను ఆలియా వేసుకున్న ఫోటోలను మనం చూడొచ్చు.

* కియారా అద్వానీ

కియారా అద్వానీ వేసుకునే తరహా స్లిమ్ ఫిట్ డెనిమ్ జీన్స్ ధరిస్తే జాగర్స్ బ్యూటి ఫుల్ గా కనిపిస్తారు. తెలుపు రంగు టాప్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ లో కియారా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. జాగర్స్ లుక్ ను మరింత అందంగా చేయడానికి ఈ తరహా జీన్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

* దీపికా పదుకునే

దీపికా పదుకునేను క్వీన్ ఆఫ్ డెనిమ్ అని పిలుస్తారు. టీ షర్ట్స్, జీన్స్ పాయింట్స్ తయారీ కంపెనీ
Levis కోసం దీపిక ప్రచారం కూడా చేస్తున్నారు. రెయిన్ బో కలర్స్ తో కూడిన తెలుపు డెనిమ్ ప్యాంట్ ను ధరించి దీపిక చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. డెనిమ్ జీన్స్ రంగురంగుల్లో లభిస్తూ.. వస్త్ర ప్రియులను తన వైపు ఆకట్టుకుంటోంది.

* రష్మిక మందన

రష్మిక మందన చాలా ఈవెంట్స్ లో డెనిమ్ జీన్స్ లో కనిపిస్తుంటారు. రిప్డ్ జీన్స్ , హ్యూమేన్ టీ షర్ట్ లో ఆమె ఇటీవల దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వాటిని కొనేసి మీ బీరువాలో ఉంచుకోండి. స్పెషల్ అకేషన్స్ లో ధరించి అట్రాక్టివ్ గా మారండి.

* దిశా పఠాని

దిశా పఠాని ఫ్యాషన్ కు మారు పేరు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ సూపర్బ్ గా ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ కారణంగా మీడియాలో ఆమెకు ఎంతో పేరు వచ్చింది. రిప్డ్ బ్యాగీ డెనిమ్ జీన్స్ తో పాటు కోర్సెట్ ధరించి దిగిన ఫోటోలను ఇటీవల దిశా పఠాని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

* జేమ్స్ డీన్

1950 లో నటుడు జేమ్స్ డీన్ హాలీవుడ్ చిత్రం ‘రాబుల్ వితౌట్ ఎ కాజ్’ చేసాడు, ఈ సినిమాలో జీన్స్‌ను మొదటిసారిగా ఫ్యాషన్‌గా ఉపయోగించారు.ప్రజలు ఈ మూవీని చూసినప్పుడు అమెరికాలోని యువత దీన్ని చాలా ఇష్టపడింది తరువాత జీన్స్ ధోరణి మొదలైంది.

ఇలా మొదలైంది..

తొలుత ఫ్రెంచ్ నావికులు డెనిమ్ జీన్స్ ధరించేవారు.ఎందుకంటే ఇది వారి యూనిఫాం.మొదటి జీన్స్ నీలం రంగులో తయారు చేశారు. ఎందుకంటే వీటిని కార్మికులు, హార్డ్ వర్కర్లు ధరించేవారు అలాగే వారి బట్టలు త్వరగా మురికిగా అవుతుంటాయి. కాబట్టి వారి బట్టలు త్వరగా మురికి కాకుండా ఉండటానికి నీలిరంగు జీన్స్ తయారు చేశారు. అలాగే నీలిరంగు రంగు కోసం జీన్స్ ప్యాంట్ కి ఇండిగో డైని ఉపయోగించారు. దీనికి ముందు జీన్స్ ను వివిధ కూలీలు, బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు ధరించేవారు.