ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, బట్టతల రావడం, జుట్టు చిట్లిపోవడం, చుండ్రు లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య ఆగిపోయి జుట్టు మునుపటిలాగే పెరగడం కోసం చాలామంది ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగించినప్పటికీ సరైన ఫలితం రాక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అలా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇకమీదట దిగులు చెందాల్సిన పనిలేదు.
ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు, జుట్టు గుబురుగా పెరగడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. అవిసె గింజలతోనే జుట్టును బాగు చేసుకోవచ్చు మరియు జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని, దానికి నాలుగు కప్పుల నీటిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల జెల్ తయారవుతుంది. కాస్త పలుచుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి, ఈ నీటిని వేడిగా ఉండగానే పలచటి బట్ట సహాయంతో వడకట్టుకోవాలి. మరీ గట్టిపడితే వడకట్టడం చాలా కష్టం అవుతుంది. ఇలా వడకట్టిన జెల్ చల్లారిన తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, పొడవుగా, నల్లగా, బలంగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా పలు రకాల జుట్టు సమస్యలను కూడా తరిమి కొడుతుంది. అవిసె గింజల జెల్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా జుట్టు చాలా త్వరగా, విపరీతమైన పొడవుగా పెరుగుతుంది. అవిసె గింజల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీని వల్ల స్కాల్ప్ కు పోషణ అందించి ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగించే ముందు మరియు ఉపయోగించిన తర్వాత మీ జుట్టులో ఏర్పడే మార్పులను మీరే గమనించవచ్చు. విటమిన్ ఇ చర్మం మరియు జుట్టు రెండింటికీ మేలు చేస్తుంది. అలాగే జుట్టు మూలాల వరకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు, తెల్ల జుట్టు సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఈ జెల్ ను హెయిర్ కండీషనర్‌గా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా, బలంగా తయారవుతుంది. ఈ జెల్ ను మీరు 10 నుంచి 15 రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఏదైనా నూనె కలపడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయి.
