Site icon HashtagU Telugu

Indian Breads : టాప్-50 బ్రెడ్లలో 8 మన దేశానివే.. నంబర్ 1 మనదే

Indian Breads Worlds 50 Best Breads Taste Atlas India

Indian Breads : బ్రెడ్లు ఎన్నో రకాలు. మన దేశంలోని ఒక్కో చోట ఒక్కో రకమైన బ్రెడ్ వినియోగంలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన ఫుడ్ కల్చర్ ఉంది. దానికి అనుగుణంగానే ప్రజల ఆహారపు అలవాట్లు ఉంటాయి.  ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్లతో ఒక జాబితాను ప్రముఖ ఆహార, ప్రయాణ సంస్థ ‘టేస్ట్‌ అట్లాస్‌’ విడుదల చేసింది. దీనిలో నంబర్ 1 స్థానాన్ని భారత్‌కు చెందిన గార్లిక్‌ బటర్‌ నాన్‌ పొందింది. ఈ లిస్టులో చోటు పొందిన మిగతా భారతీయ బ్రెడ్ల గురించి తెలుసుకుందాం..

1వ ర్యాంకు :  బటర్ గార్లిక్ నాన్ ​

బటర్ గార్లిక్ నాన్ ఉత్తరాదిలో చాలా ఫేమస్.  ఈ బ్రెడ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది.  దీనిలో బటర్, గార్లిక్ ఉంటాయి. తందూర్‌లో దీన్ని బేక్ చేస్తారు. కర్రీలతో తినేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది.

2వ ర్యాంకు :  అమ్రిత్సరీ కుల్చా ​

అమ్రిత్సరీ కుల్చా  అనేది పంజాబీ బ్రెడ్(Indian Breads).  పై భాగంలో ఇది క్రిస్పీగా ఉంటుంది. దీనిలోపల బంగాళాదుంపలు లేదా పన్నీర్ ఉంటాయి.  తందూర్‌లో దీన్ని బేక్ చేస్తారు. ఛోలేతో పాటు అమ్రిత్సరీ కుల్చాను తినొచ్చు. టిఫిన్‌లో తినదగిన టేస్టీ వంటకం ఇది.

Also Read :Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?

6వ ర్యాంకు : పరోటా 

పరోటా తమిళనాడులో చాలా ఫేమస్. దీనికి 6వ ర్యాంకు వచ్చింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒకే తరహా పరోటాను తయారు చేస్తారు. ఈ పరోటాలో క్రిస్పీ లేయర్లు ఉంటాయి. పొడిగా, చదునుగా ఉంటుంది. పాన్‌పై దీన్ని ఫ్రై చేస్తారు.

8వ ర్యాంకు : నాన్ 

నాన్‌కు 8వ ర్యాంకు వచ్చింది. చదునుగా ఉండే రకం బ్రెడ్ ఇది. దీన్ని కూడా  తందూర్‌లోనే తయారు చేస్తారు. పొడిపొడిగా, టేస్టీగా ఉంటుంది.

18వ ర్యాంకు : పరాఠా 

ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సేల్ అయ్యే పరాఠాకు 18వ ర్యాంకు వచ్చింది. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. పాన్‌పైనే దీన్ని ఫ్రై చేస్తారు. పలుచోట్ల ఈ పరాఠాలో బంగాళాదుంపలు, పన్నీరు, సీజనల్ కూరగాయలను ఫిల్ చేసి తింటారు. తద్వారా ఇది సంపూర్ణ ఆహారంగా మారుతుంది.

26వ ర్యాంకు : భతూరా 

స్పైసీ ఛోలేతో  పాటు అందించే వంటకం భతూరా . ఇది భారత్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ప్రత్యేకించి ఉత్తరాది ప్రజలు ఛోలే భతూరాను చాలా ఇష్టంగా తింటారు.

28వ ర్యాంకు : ఆలూ నాన్ 

ఆలూ నాన్ అనేది ఉత్తరాదిలో ఫేమస్.  నాన్‌లోకి మెత్తటి బంగాళాదుంపలను ఫిల్  చేసి దీన్ని తయారు చేస్తారు.  ఈ వంటకం స్పైసీ టేస్ట్‌తో ఉంటుంది.

​35వ ర్యాంకు : రోటీ

రోటీ అనేది 35వ ర్యాంకును పొందింది. యావత్ భారత దేశంలో రోటీ చాలా ఫేమస్. ప్రత్యేకించి ఉత్తరాదిలో దీని వినియోగం ప్రతిరోజూ, ప్రతిపూట ఉంటుంది. గోధుమ పిండితో రొట్టెను తయారు చేస్తారు.