Putin-Modi Meeting: ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం భారత ప్రధాని నరేంద్రమోడి(Narendra Modi) రష్యా(Russia) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపై ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensky) స్పందించారు. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో ఆయన సమావేశం “భారీ నిరాశ మరియు శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ” అని అభివర్ణించారు. అయితే గత నెలలో జీ7 శికరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీని కలిసిన జెలెన్స్కీ Xలో ఒక పోస్టులో ఈ విధంగా అన్నారు. “ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు నిరాశ మరియు శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని పేర్కొన్నారు. “ప్రపంచం ఇప్పుడు దాని గురించి మౌనంగా ఉండకూడదని, రష్యా ఏమిటో అది ఏమి చేస్తుందో ప్రతి ఒక్కరూ చూడటం చాలా ముఖ్యం” అని జెలెన్స్కీ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాకు తన మొదటి పర్యటనను సూచిస్తూ సోమవారం మాస్కో వెలుపల నోవో-ఒగారియోవోలోని అధికారిక నివాసంలో పుతిన్‌తో ప్రధాని మోడీ అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు, ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలే ముందున్న మార్గమని ప్రధాని మోడీ పుతిన్‌తో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
Read Also: Protocol : నేను అలగలేదు – మంత్రి పొన్నం క్లారిటీ
ప్రధాని మోడీ మరియు పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ముందు, ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలని రష్యాకు స్పష్టం చేయాలని అమెరికా భారతదేశానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ వద్ద ఉక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి ప్రస్తావించాలని కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో సోమవారం మాట్లాడారు.
Read Also: Viral news : ఉదయం లేవగానే పెట్రోల్ తాగాలి… తప్పనిసరి… వింత వ్యాధితో యువతి