Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు శివాలయమే.. సీఎం యోగి ఆదిత్యనాథ్

జ్ఞానవాపి అనేది సాక్షాత్తూ విశ్వనాథుడి పుణ్య స్థలమని యోగి ఆదిత్యనాథ్(Gyanvapi Mosque) చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Gyanvapi Basement

Gyanvapi Mosque : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు‌ అంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జ్ఞానవాపి మసీదు‌ను ముస్లిం ప్రార్థనా స్థలంగా చెబుతున్నారు. వాస్తవానికి అదొక  శివాలయం’’ అని ఆయన పేర్కొన్నారు.  జ్ఞానవాపి అనేది సాక్షాత్తూ విశ్వనాథుడి పుణ్య స్థలమని యోగి ఆదిత్యనాథ్(Gyanvapi Mosque) చెప్పారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Sebi Chief : ఆ స్టాక్స్‌లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు

‘‘దురదృష్టవశాత్తు ప్రజలు జ్ఞానవాపిని మసీదుగా పిలుస్తుంటారు. వాస్తవానికి అది శివుడి ఆలయం. ఈ స్థలంలో పూజలు, ప్రార్థనలు రెండూ కొనసాగుతున్నాయి. జాతీయ ఐక్యత, సమగ్రతకు నిదర్శనంగా జ్ఞానవాపి నిలుస్తోంది’’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ‘‘జ్ఞానవాపిలోని ఐక్యతా భావం ఆనాడే  దేశ ప్రజల్లో ఉండి ఉంటే.. భారత్ ఎన్నడూ వలసరాజ్యంగా మారి ఉండేది కాదు’’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ‘‘జ్ఞానవాపి’’ మసీదు అంశంపై చాలా ఏళ్లుగా న్యాయ వివాదం కొనసాగుతోంది.  దీనిపై హిందూ సంఘాలు, ‘‘జ్ఞానవాపి’’ మసీదు కమిటీ మధ్య కేసు నడుస్తోంది.

Also Read :Zika Vaccine : జికా వ్యాక్సిన్‌ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్

వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన మసీదు ప్రాంగణంలోని వజూఖానాలో వీడియో సర్వే చేశారు. వజూఖానా ఏరియాలో హిందూ దేవీదేవతల విగ్రహాలు కనిపించాయి. వజూఖానాలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారాన్ని గుర్తించారు. అయితే అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదిస్తోంది. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ మసీదును నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్ఞానవాసి మసీదు సీలు చేసిన నేలమాళిగలో హిందూ భక్తులు పూజలు చేయడానికి  వారణాసి కోర్టు అనుమతులు మంజూరు చేసింది. జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తైఖానా’లో హిందూ భక్తులను ప్రార్థనలు చేయడానికి కోర్టు ఆనాడు పర్మిషన్ ఇచ్చింది.

Also Read:NTR vs Karthi : ఎన్టీఆర్ కు పోటీగా కార్తీ..తట్టుకోలేస్తాడా..?

  Last Updated: 14 Sep 2024, 05:28 PM IST