భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని యతి నర్సింహానంద్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దాలలో దేశం “హిందూ-లెస్” గా మారకుండా నిరోధించడానికి పిల్లలను ఎక్కువమందిని కనాలని ఆయన పిలుపునిచ్చారు. హిందువులు మెజారిటీగా ఉన్నందున భారతదేశం ప్రజాస్వామ్య దేశమని అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ యతి సత్యదేవానంద సరస్వతి తెలిపారు. కానీ ముస్లింలు ప్రణాళికాబద్ధంగా చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం ద్వారా తమ జనాభాను పెంచుకుంటున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలోని ముబారక్‌పూర్‌లో సంస్థ మూడు రోజుల ‘ధరం సన్సద్స కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే, భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండటానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని తమ సంస్థ హిందువులను కోరిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న యతి నర్సింహానంద్, అన్నపూర్ణ భారతి, అనేక మంది ఇతర ధర్మకర్తలు, పూజారులు హాజరవుతున్న ఈ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని, హిమాచల్ ప్రదేశ్ పోలీసులు సరస్వతికి నోటీసులో ఏ మతానికి వ్యతిరేకంగా లేదా రెచ్చగొట్టే భాష ఉపయోగించకూడదని సూచించారు. పోలీస్ యాక్ట్ 2007లోని సెక్షన్ 64 కింద నోటీసు జారీ చేస్తూ, ఉనా జిల్లాలోని అంబ్ పోలీస్ స్టేషన్ SHO అటువంటి సూచనలను పాటించకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల జాతీయ విధానానికి ఇది వ్యతిరేకం కాదా అని ప్రశ్నించగా.. భారతదేశంలో పౌరులు ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలని కోరే చట్టం లేదన్నారు. గత ఏడాది డిసెంబర్ 17-19 వరకు హరిద్వార్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ నర్సింహానంద్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.