Site icon HashtagU Telugu

Parliament Attack : డిసెంబరు​ 13కల్లా పార్లమెంటుపై​ దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ ​పన్నూ వార్నింగ్

Nia Vs Khalistan Separatist

Nia Vs Khalistan Separatist

Parliament Attack : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్​ సింగ్​ పన్నూ మరోసారి భారత్‌పై పేట్రేగిపోయాడు. డిసెంబరు​ 13కు ముందే పార్లమెంటు​ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజైన డిసెంబర్​ 13న లేదా అంతకన్నాముందే ఖలిస్తానీ ఉగ్రవాదులతో పార్లమెంటుపై దాడి చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు గురుపత్వంత్ ఒక వార్నింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. గురుపత్వంత్ సింగ్​ పన్నూ హత్యకు భారత నిఘా సంస్థలు పథక రచన చేశాయని అమెరికా మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో అమెరికాలోనే దాక్కున్న టెర్రరిస్ట్ గురుపత్వంత్​ సింగ్​ పన్నూ.. భారత్ టార్గెట్‌గా పిచ్చి కూతలు కూశాడు.

We’re now on WhatsApp. Click to Join.

భారత పార్లమెంటుపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాది గురుపత్వంత్​ సింగ్​ పన్నూ విడుదల చేసిన వీడియోలో.. అతడి వెనుక అఫ్జల్ గురు ఫొటో కనిపించింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి సూత్రధారి అఫ్జల్ గురు. ఈ ఫొటోతో పాటు ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ (ఢిల్లీని ఖలిస్థాన్‌గా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్​ను కూడా పన్నూ డిస్‌ప్లే చేశాడు. తనను హత్య చేయడానికి భారత గూఢచార సంస్థలు చేసిన కుట్రలు ఫెయిలయ్యాయని ఆ పోస్టర్‌లో పేర్కొన్నాడు. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్​ 13కు ముందు పార్లమెంట్​పై దాడి చేయిస్తానన్నాడు. ఉగ్రవాది గురుపత్వంత్​ బెదిరింపు వీడియోతో కేంద్ర నిఘా సంస్థలు(Parliament Attack) అలర్ట్ అయ్యాయి.

Also Read: Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..