Maoists Top Leader: కాబోయే మావోయిస్టు దళపతి ఎవరు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇటీవలే నంబాల కేశవరావును ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ చేశారు. ఆయన చనిపోయే వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించే వారు. దీంతో నంబాల కేశవరావు స్థానాన్ని ఎవరితో మావోయిస్టులు భర్తీ చేయబోతున్నారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈతరుణంలో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ వివరాలపై ఒక లుక్ వేద్దాం..
Also Read :Romantic Relationships : నానో షిప్స్, లవ్ బాంబింగ్, కుషనింగ్ పేర్లతో ఎన్నో రిలేషన్‌షిప్స్.. ఏమిటివి ?
తిరుపతి, వేణుగోపాల రావు గురించి..
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను పేర్లను మావోయిస్టు అగ్ర నాయకత్వం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ తెలంగాణ వాస్తవ్యులే కావడం గమనార్హం. తిరుపతిది జగిత్యాల కాగా, వేణుది పెద్దపల్లి. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా తిప్పిరి తిరుపతి వ్యవహరిస్తున్నారు. ఇది మావోయిస్టు పార్టీ సాయుధ విభాగం. ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి వయసు 62 ఏళ్లు కాగా, వేణుగోపాలరావు వయసు 70 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో వయసు పైబడిన వారికే పెద్దపెద్ద అవకాశాలు లభిస్తుంటాయి. అదే ట్రెండ్ మావోయిస్టు పార్టీలోనూ ఉన్నట్టు కనిపిస్తోంది. తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వేణుగోపాలరావు అగ్రకులానికి చెందినవారు. మావోయిస్టుల్లోనూ సామాజిక సమీకరణాలు పనిచేస్తాయని పరిశీలకులు అంటున్నారు.
Also Read :India Vs Pakistan : ‘సిందూరం’ పవర్‌ను చూపించాం.. పాక్‌కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
అలర్ట్ మోడ్‌లోకి భారత నిఘా వర్గాలు
మావోయిస్టు పార్టీలో మల్లోజుల వేణుగోపాలరావుకు సీనియర్ల మద్దతు ఉందని భావిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. మావోయిస్టు పార్టీ మాజీ సారథి మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడే ఈ మల్లోజుల వేణుగోపాలరావు. అయితే మావోయిస్టు పార్టీలో పెద్దసంఖ్యలో దళిత, ఆదివాసీ, గిరిజనవర్గాల వారు ఉన్నారు. వారి నుంచి తిప్పిరి తిరుపతికి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు నేతలు మావోయిస్టు పార్టీ పగ్గాల కోసం పోటీ పడతారా ? కలిసి పనిచేస్తారా ? అనే దాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. వారిద్దరి లొకేషన్‌ను సైతం ట్రాక్ చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. తద్వారా 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంగా దిశగా ముందడుగు వేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తోంది.