BJP New President: బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికపై మరింత క్లారిటీ వచ్చింది. మార్చి 30వ తేదీలోగా ఈ పోస్టును భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ ఈ కీలకమైన పదవి కోసం పోటీలో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఎవరు ? బీజేపీ చీఫ్ పదవి భర్తీకి ఇంకా నెల రోజుల సమయం ఎందుకు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు
చాలా కీలకమైన పోస్ట్
బీజేపీ జాతీయ అధ్యక్ష(BJP New President) పదవి అనేది చాలా కీలకమైంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లాంటి దిగ్గజ నేతలతో సన్నిహితంగా మెలిగే అవకాశం బీజేపీ చీఫ్‌కు దక్కుతుంది. అందుకే ఈ పోస్టు కోసం ఎంతోమంది బీజేపీ నేతలు తమవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా తాము పార్టీకి చేసిన సేవల గురించి ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నారు. ఈక్రమంలో ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ వంటి కీలక నేతలను ఆశావహులు కలుస్తున్నారు. ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న ముఖ్య బీజేపీ నేతల వివరాలను చూద్దాం.
Also Read :Rs 2500 For Women: మహిళలకు ప్రతినెలా రూ.2,500.. ‘మహాలక్ష్మి’ స్కీం కొత్త అప్‌డేట్
రేసులో వీరే..
- ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టబోయే నేత ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
- వరుసగా గత మూడు దఫాల్లో ఉత్తరాది రాష్ట్రాల వారికే బీజేపీ చీఫ్ పోస్టు దక్కింది. ఈసారి కూడా అలాగే జరగొచ్చని అంచనా వేస్తున్నారు.
- ప్రధాని మోడీకి సన్నిహితులైన వారికే ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉంది.
- బీజేపీ చీఫ్ పోస్టును ఆశిస్తున్న వారిలో హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
- ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ కూడా ఈ పోటీలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు.
- తెలంగాణకు చెందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. అయితే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నందున ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఫుల్ టైం పార్టీకే కేటాయించే నేతలకు మాత్రమే బీజేపీ చీఫ్ పోస్టును ఇవ్వాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం.
- బీజేపీ నేత సునీల్ బన్సాల్ కూడా ఈ పోటీలో ఉన్నారు. రాజస్థాన్, యూపీ, ఒడిశాలలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
- మోడీ, షాలకు సన్నిహితుడు వినోద్ తావ్డే. ఈయన విద్యార్థి జీవితం నుంచీ బీజేపీలోనే ఉన్నారు.
- అనురాగ్ ఠాకూర్ బీజేపీ సీనియర్ నేత. గతంలో ఈయన బీజేపీ యువ మోర్చా (BJYM) అధ్యక్షుడిగా సేవలు అందించారు. హమీర్‌పూర్ నుండి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యులే.