Ashwin Ramaswami : అమెరికా ఎన్నికల బరిలో 24ఏళ్ల ‘రామస్వామి’.. ఇక రికార్డులు బ్రేక్!

Ashwin Ramaswami : అశ్విన్ రామస్వామి పేరు ఇప్పుడు అమెరికాలోని జార్జియా  రాష్ట్రంలో ఉన్న భారత వర్గాల్లో మార్మోగుతోంది.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 04:17 PM IST

Ashwin Ramaswami : అశ్విన్ రామస్వామి పేరు ఇప్పుడు అమెరికాలోని జార్జియా  రాష్ట్రంలో ఉన్న భారత వర్గాల్లో మార్మోగుతోంది. ఎందుకంటే ఆయన జార్జియా సెనేట్ స్థానానికి ఈసారి పోటీ చేస్తున్నారు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఎన్నికల్లో అశ్విన్ రామస్వామి చేస్తుండటం విశేషం. దీంతో సెనేట్ ఎన్నికల బరిలోకి దిగిన తొలి జెన్ Z ఇండో అమెరికన్​గా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. సాఫ్ట్​​వేర్​ ఇంజినీర్ అయిన అశ్విన్.. ఇప్పటివరకు ఇంజినీరింగ్, ఎన్నికల భద్రత, టెక్నాలజీ తదితర రంగాల్లో పనిచేశారు. ఒకవేళ అశ్విన్ రామస్వామి ఎన్నికైతే, కంప్యూటర్ సైన్స్​తోపాటు లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ సభ్యుడిగా రికార్డు క్రియేట్ చేస్తారు. అశ్విన్ రామస్వామి(Ashwin Ramaswami) స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్​లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.  ప్రభుత్వ సంస్థ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA)లో సివిల్ సర్వెంట్​గా పనిచేశారు. 2020-2022 మధ్య స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. జార్జియా అటార్నీ జనరల్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డివిజన్‌లో లీగల్ ఆఫీసర్​గా కూడా పనిచేశారు.

We’re now on WhatsApp. Click to Join

34 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి అమెరికాకు.. 

జెన్​ Z అంటే 1997 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్య పుట్టినవాళ్లు. 34 ఏళ్ల క్రితం (1990 సంవత్సరంలో) తమిళనాడు ​ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన అశ్విన్ జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం అధికార డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తన రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో సెనేట్​కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలాగే ఎదుగుతున్న ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని ఆయన అంటున్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఐటీ రంగానికి చెందినవారేనని చెప్పారు.  అశ్విన్ వాళ్ల అమ్మది చెన్నై.. నాన్నది కోయంబత్తూరు. ‘‘నేను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగాను. నేను హిందువును. నాకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉంది. చిన్మయ మిషన్ బాలవిహార్​కు వెళ్లి రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇతిహాసాల గురించి తెలుసుకున్నాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. అనేక పురాతన గ్రంథాలను చదివాను. ఉపనిషత్తులు చదివాలనే ఆసక్తి ఉంది. రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటాను’’ అని అశ్విన్ చెప్పారు.

Also Read : Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్‌ ఈవెంట్స్

‘‘మా తరం వాళ్లు వార్తలను బాగా చూస్తారు. జరిగేవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. దేశానికి మంచి ఫ్యూచర్‌ను అందించాలని మేం కోరుకుంటున్నాం. అయితే మేం ఎదుర్కొనే ఒక సమస్య ఉంది. మా దగ్గర ఇతరుల్లా సరిపడా వనరులు లేవు. అందుకే మేం ఎన్నికల్లో గెలవడం చాలా టఫ్. ఎన్నికల్లో పెద్దవాళ్లను ఎన్నుకోవడానికే ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. ఆ సంప్రదాయాన్ని మార్చేందుకే నేను పోటీలోకి దిగాను. ఈ ఎన్నికల్లో గెలిచి అందరికీ ఓ ఉదాహరణగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అశ్విన్ రామస్వామి తన మనసులోని మాటలను వివరించారు.

Also Read : Tata Vs Pakistan : పాక్ జీడీపీని దాటేసిన టాటాగ్రూప్.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా ?