What is Teesta Prahar: బంగ్లాదేశ్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసేలా.. ‘తీస్తా ప్రహార్’ పేరుతో భారీ సైనిక విన్యాసాలను భారత సైన్యం నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ విన్యాసాలు జరిగాయి. తీస్తా నదీ తీర ప్రాంతంలో యుద్ధం జరిగితే ఎలా ఎదుర్కోవాలి ? శత్రువు వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలి ? అనే దానిపై భారత ఆర్మీ కసరత్తు చేసింది. తీస్తా నదీ తీర ప్రాంతాల్లో ఆయుధ రవాణా, సైనికుల మధ్య సమన్వయం వంటి అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించారు. భారత సైన్యంలోకి చేరిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలను వినియోగించడంపై, యుద్ధ క్షేత్రంలో సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈసందర్భంగా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.
Also Read :Hitchhiking : రెచ్చిపోతున్న కిలేడీలు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతి !!
తీస్తా నది గురించి తెలుసా?
- తీస్తా నది 414 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది.
- ఈ నది తూర్పు హిమాలయ ప్రాంతంలోని పౌహున్రిలో జన్మిస్తుంది.
- తీస్తా నది భారత దేశంలోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి ఎంటర్ అవుతుంది.
- బంగ్లాదేశ్‌లోకి తీస్తా నది ప్రవేశించాక.. జమునా నదిలో కలుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోని ఇతరత్రా నదులతో తీస్తా నది సంగమిస్తుంది.
- చివరగా బంగ్లాదేశ్ తీరంలోని బంగాళాఖాతంలో తీస్తా నది కలుస్తుంది.
- సిక్కింలో అతిపెద్ద నది తీస్తా. పశ్చిమ బెంగాల్‌లో రెండో అతిపెద్ద నది తీస్తా.
భారత్ – బంగ్లా మధ్య కుదరని సయోధ్య
గత కొన్ని దశాబ్దాలుగా తీస్తా నదీ జలాల పంపకం(What is Teesta Prahar) విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివాద పరిష్కారానికి పలుమార్లు ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపాయి. తీస్తా నదీజలాలపై 1983 నుంచి చర్చలు జరుగుతున్నా.. ఇప్పటివరకైతే వివాదానికి ఒక పరిష్కారం లభించలేదు. 1983లో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం.. తీస్తా నదిలో 39 శాతం జలాలు భారత్‌కు, 36 శాతం జలాలు బంగ్లాదేశ్‌కు దక్కుతాయి. మిగతా 25 శాతం జలాల కేటాయింపుపై ఇంకా ఇరుదేశాల మధ్య అంగీకారం కుదరలేదు. చివరిసారిగా 1996లోనూ ఈ నదీ జలాల పంపిణీ విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరింది.
Also Read :Musi Riverfront : ‘మూసీ రివర్ ఫ్రంట్’కు అప్పుల బాటలో అడ్డంకులు.. కేంద్రం కొర్రీలు
భారత్‌ను కవ్విస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం
2024 సంవత్సరంలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారింది. మహ్మద్ యూనుస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నారు. ఈయన పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదేపదే భారత్‌ను కవ్వించేలా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తీస్తా నదీ జలాల విషయంలో భారత్ రాజీకి రాకుంటే.. ఇరుదేశాల సంబంధాలు దెబ్బతినడం ఖాయమని బంగ్లాదేశ్ ప్రభుత్వ పెద్దలు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ హెచ్చరికలు భారత్‌కు అస్సలు నచ్చడం లేదు. భవిష్యత్తులో తీస్తా నదీజలాల వ్యవహారం తీవ్రరూపు దాల్చే అవకాశం లేదు. అందుకే భారత సైన్యం తీస్తా నదీ పరివాహక ప్రాంతంలో ‘తీస్తా ప్రహార్’ పేరుతో సన్నాహాలు మొదలుపెట్టింది.