Champai Soren : త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ఆ దిశగా ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టారు. జార్ఖండ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ తన అభిమానులను ఏకం చేసే పనిలో చంపై సోరెన్ బిజీగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ వైపు నుంచి చంపై సోరెన్‌కు పెద్ద ఆఫర్ వచ్చింది. దీనికి సంబంధించి అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కీలక కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా అసోం సీఎం(Champai Soren) జార్ఖండ్ పర్యటనలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు. చంపై సోరెన్ బీజేపీలో చేరి, జార్ఖండ్‌లో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ‘‘చంపై సోరెన్ రాజకీయాల్లో నాకన్నా చాలా సీనియర్. ఆయనపై ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను’’ అని హిమంత పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తాను చంపైతో టచ్‌లోనే ఉన్నానని వెల్లడించారు. ‘‘చంపై సోరెన్ ఢిల్లీలో ఉంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. గతంలో చాలాసార్లు ఆయనతో మాట్లాడినా రాజకీయాల గురించి ప్రస్తావించుకోలేదు. ఇప్పుడు రాజకీయాల గురించి చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని అసోం సీఎం వెల్లడించారు.
Also Read :Telegram CEO : టెలిగ్రామ్ ఓనర్ పావెల్ దురోవ్ అరెస్టు వెనుక మిస్టరీ మహిళ.. ఎవరామె ?
ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ కో ఇన్ ఛార్జిగా హిమంతను నియమించారు. అందుకే ఆయన జార్ఖండ్‌లో బీజేపీ బలోపేతం కోసం కసరత్తు చేస్తున్నారు. అందుకే గత కొన్ని నెలలుగా చంపై సోరెన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాను బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలను చంపై సోరెన్ ఖండించారు. జేఎంఎం పార్టీని వదలడం ఖాయమని స్పష్టం చేశారు.కొత్త పార్టీ ఏర్పాటుకే తాను ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.