Uttar Pradesh: ముస్లిం యువకుడి ఛాతీపై యోగి టాటూ!

యూపీలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. యోగీపై విమర్శలొస్తున్న సమయంలో యమీన్ సిద్ధిఖీ

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 01:44 PM IST

యూపీలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. యోగీపై విమర్శలొస్తున్న సమయంలో యమీన్ సిద్ధిఖీ అనే 23 ఏళ్ల ముస్లిం యువకుడు తన ఛాతీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాన్ని టాటూగా వేయించుకోవడం ఆసక్తి రేపుతోంది. యోగి తన రోల్ మోడల్ అని, ఈ నెల మొదట్లో యోగి పుట్టినరోజు సందర్భంగా టాటూ వేయించుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఫరూఖాబాద్, మెయిన్‌పురి జిల్లాల సరిహద్దులో ఉన్న ఒక గ్రామంలో సిద్దిఖీ నివసిస్తున్నాడు చెప్పుల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ యువకుడు టాటూ వేయించుకున్నప్పటి నుండి స్నేహితులు, బంధువుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. “యోగి ఆదిత్యనాథ్‌ని కలుసుకుని టాటూ చూపించాలన్నది నా కోరిక. ఆయనంటే నాకు అమితమైన ప్రేమ, గౌరవం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌ను మార్చేశారు. ఎలాంటి వివక్ష లేదు. హిందువులు, ముస్లింలు అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు, ”అని సిద్ధిఖీ చెప్పారు. అయితే జ్ఞాన్‌వాపి మసీదు, ఈద్గా వంటి వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేందుకు యువకుడు నిరాకరించాడు.