Indian Artefacts : మన భారతదేశంలో దొంగతనానికి గురై వివిధ మార్గాల్లో అమెరికాకు చేరిన దాదాపు 1,400కుపైగా కళా ఖండాలు తిరిగి వచ్చేశాయి. వాటిని భారత్‌కు అప్పగించామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కళాఖండాల విలువ దాదాపు రూ.84 కోట్లకుపైనే ఉంటుందని తెలిపింది. భారత్‌కు అప్పగించడానికి ముందు వరకు ఆ కళాఖండాలు సురక్షితంగా న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఉండేవని వెల్లడించింది. నృత్య భంగిమలో ఉన్న ఒక విలువైన కళాఖండం(Indian Artefacts) భారత్‌లోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చోరీకి గురైంది. దాన్ని దుండగులు లండన్‌కు స్మగ్లింగ్ చేశారు. లండన్‌లో ఉన్న స్మగ్లర్లు దాన్ని న్యూయార్క్‌కు చెందిన ఒక సంపన్నుడికి విక్రయించారు. చివరకు సదరు సంపన్నుడు ఆ కళాఖండాన్ని న్యూయార్క్ మ్యూజియంకు విరాళంగా అందించారు. ఇన్నిచోట్ల తిరిగిన ఆ అపురూప కళాఖండం తిరిగి మన భారతదేశానికి వచ్చేసింది.
Also Read :Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ
సుభాష్ కపూర్‌ను భారత్ మాకు అప్పగించాలి
అమెరికాలో కళాఖండాల స్మగ్లింగ్ దందాను నడిపిన నాన్సీ వియెనెర్, సుభాష్ కపూర్‌ల పేర్లను తాజాగా మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ‘‘సుభాష్ కపూర్ న్యూయార్క్‌లో ఒక గ్యాలరీని నడిపేవాడు. దాన్ని అడ్డాగా చేసుకొని భారత్ సహా చాలా దేశాల నుంచి కళాఖండాలను అతడు స్మగ్లింగ్ చేసుకునేవాడు’’ అని తెలిపింది. ప్రస్తుతం అతడు భారత పోలీసుల అదుపులో ఉన్నాడని.. తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతామని మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం పేర్కొంది. అమెరికాలో స్మగ్లింగ్ వ్యవహారాలను నడిపినందుకు సుభాష్ కపూర్‌కు ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష పడిందని, దాన్ని అతడు అనుభవించాల్సి ఉందని వెల్లడించింది. 2011లో సుభాష్ కపూర్‌ను జర్మనీ పోలీసులు అరెస్టు చేసి భారత్‌కు అప్పగించారు.
Also Read :Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు
- ఈ ఏడాది సెప్టెంబరులోనూ మరో 297 కళాఖండాలను భారత్‌కు అమెరికా అప్పగించింది. వీటిలో హరప్పా మొహంజోదారో కాలం నాటి కళాఖండాలు కూడా ఉన్నాయి. రాతితో, లోహాలతో, కర్రతో, ఏనుగు దంతాలతో చేసిన ప్రతిమలు కూడా వాటిలో ఉండటం విశేషం.
- 2023 జూన్‌లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 105 భారత కళాఖండాలను అమెరికా అందజేసింది.
- 2021 సెప్టెంబరులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 157 భారత కళాఖండాలను అమెరికా అందజేసింది.
- 2016 జూన్‌లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 10 భారత కళాఖండాలను అమెరికా అందజేసింది.