Blatant Mistake: ఆ పోలీసు అధికారి విధి నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలంటూ జడ్జి జారీ చేసిన నోటీసులతో.. సదరు పోలీసు అధికారి నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లాడు. నిందితుడి ఇంటికి వెళ్లి.. జడ్జి పేరు చెప్పి ఆరా తీస్తే లాభం ఏముంటుంది ? నిందితుడు దొరుకుతాడా ? అస్సలు దొరకడు. అక్కడ కూడా అదే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్ ఇంత దారుణంగా విధులు నిర్వర్తించాడు.
Also Read :Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
పోలీసు అధికారి ఏం చేశారంటే..
ఒక దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి అందించాలని జడ్జి నగ్మా ఖాన్(Blatant Mistake) జారీ చేసిన ఉత్తర్వులు ఇవి. అయితే సబ్ ఇన్‌స్పెక్టర్ ఆ ఉత్తర్వుల్లో నిందితుడి పేరుకు బదులుగా జడ్జి నగ్మా ఖాన్ పేరునే రాసుకున్నాడు. నోటీసులు ఇచ్చేందుకు నిందితుడి ఇంటికి వెళ్లి జడ్జి నగ్మాఖాన్ పేరుతో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆరాతీయగా.. అలాంటివారు ఎవరూ లేరని బదులిచ్చారు. ఆ తర్వాత కోర్టులో జడ్జి నగ్మాఖాన్ ఎదుట హాజరైన సబ్ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్.. ‘‘మేం ఎంత వెతికినా ఆ ఇంట్లో నగ్మా ఖాన్ కనిపించలేదు. తదుపరి ఉత్తర్వులు ఇవ్వండి’’ అని వివరణ ఇచ్చాడు. ఈ మాటలు విన్న జడ్జి నగ్మా ఖాన్ అవాక్కయ్యారు.
Also Read :Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?
అవాక్కయ్యాక.. జడ్జి వ్యాఖ్యలివీ..
‘‘ఈ కోర్టు ఎవరికి, ఏతరహా నోటీసులు పంపిందో పోలీసు అధికారికి తెలియకపోవడం వింతగా ఉంది. విధి నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా ? అసలు ఆ నోటీసులను పోలీసు అధికారి పూర్తిగా చదవలేదు. వాటి గురించి అతడికి కనీస జ్ఞానం కూడా లేదు అనిపిస్తోంది. కోర్టు నోటీసులను పంపిణీ చేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ఆ ప్రక్రియలు తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు’’ అని జడ్జి నగ్మాఖాన్ హితవు పలికారు. బన్వారిలాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసు చీఫ్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.