Site icon HashtagU Telugu

Yogi Adityanath : అప్పుడు అయోధ్య, సంభల్‌‌లో జరిగిందే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతోంది : సీఎం యోగి

Up Cm Yogi Adityanath Ayodhya Sambhal Bangladesh

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌‌ పట్టణంలో మసీదుకు సంబంధించి జరిగిన ఘర్షణలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి  బాబర్ హయాంలో అయోధ్య, సంభల్‌‌లో ఏదైతే జరిగిందో.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కూడా అదే జరుగుతోందని  ఆయన వ్యాఖ్యానించారు. ‘‘500 ఏళ్ల క్రితం బాబర్‌కు చెందిన ఒక సైన్యాధిపతి అయోధ్య, సంభల్‌లలో కొన్ని పనులు చేశారు.. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్నదీ అదే.. ఈ మూడు చోట్ల(సంభల్, అయోధ్య, బంగ్లాదేశ్) జరిగిన, జరుగుతున్న ఘటనలకు సంబంధించిన  డీఎన్ఏ ఒక్కటే’’ అని సీఎం యోగి పేర్కొన్నారు.

Also Read :New RTC Depots : తెలంగాణలో మరో 2 ఆర్టీసీ డిపోలు.. ఏ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారంటే ?

‘‘భారత సమాజాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని విభజనవాద శక్తులు కుట్రలు చేస్తున్నాయి. సామాజిక ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయి. మిమ్మల్ని ముక్కలు చేసేందుకు, ముక్కలు చేయించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని యోగి(Yogi Adityanath) వివాదాస్పద కామెంట్స్ చేశారు.  ‘‘భారతదేశంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే.. ఆ విభజన శక్తులు ఇతర దేశాల్లోని వారి స్థానాలకు వెళ్లిపోతుంటాయి. చివరకు ఇక్కడ ఉన్న వాళ్లే నష్టపోతుంటారు. చనిపోతుంటారు. బాధపడుతుంటారు’’ అని యూపీ సీఎం పేర్కొన్నారు. అయోధ్యలో 43వ రామాయణ్ మేళాలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. యావత్ సమాజాన్ని శ్రీరాముడు ఏకం చేశాడని ఆయన చెప్పారు. కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఆదిత్యనాథ్‌ ఫైర్ అయ్యారు.

Also Read :Mumbai Attack Kingpin: ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీకి పేరుకే జైలుశిక్ష.. ఉండేదంతా బయటే!

‘‘భారత సమాజాన్ని విభజించే కుట్రలు చేస్తున్నారు. మనం వాటిని గతంలోనే తిప్పి కొట్టి ఉంటే బాగుండేది. మన దేశం వలస రాజ్యంగా మారి ఉండేది కాదు. మన మధ్య విభేదాలు సృష్టించిన వాళ్లు గెలిచారు. ఇప్పుడు కులం పేరుతో ప్రజల మధ్య విభజన రేఖను గీసే ప్రయత్నంలో ఉన్నారు’’ అని సీఎం యోగి తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌పై దేశ ద్రోహ నేరారోపణలు మోపడాన్ని ఆయన తప్పుపట్టారు. అక్కడి మైనార్టీలకు తగిన రక్షణ కల్పించాలన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు సోషలిస్టు సిద్ధాంత కర్త రాంమనోహర్‌ లోహియా గురించి మాట్లాడతారని, అయితే ఆయన భావజాలాన్ని అనుసరించరని  విమర్శించారు.