Site icon HashtagU Telugu

Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మనవరాలి దారుణ మర్డర్

Union Minister Jitan Ram Manjhis Grand Daughter Sushma Devi Gaya Bihar

Jitan Ram Manjhi: బిహార్‌ మాజీ సీఎం, కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు సుష్మాదేవి (32) దారుణ హత్యకు గురయ్యారు. భర్త రమేష్‌ ఈ హత్యకు పాల్పడ్డాడు. బిహార్‌లోని గయ జిల్లా టెటువా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుష్మాదేవి భర్త రమేష్‌ తన పనిని ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఆ వెంటనే సుష్మాదేవి,  రమేష్‌ మధ్య గొడవ జరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్రరూపు దాల్చింది. చివరకు కోపంలో ఊగిపోయిన రమేష్.. నాటు తుపాకీని తీసుకొని సుష్మపై ఫైరింగ్ చేశాడు. కాల్పుల్లో సుష్మాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Also Read :Aryan Khan : షారుక్ ఖాన్ వారసుడి కెరీర్ షురూ.. వెబ్ సిరీస్ వస్తోంది

సుష్మా దేవి, రమేష్‌లకు 14 ఏళ్ల క్రితం పెళ్లి.. 

ఆ వెంటనే ఘటనా స్థలం నుంచి రమేష్ పరారయ్యాడు. సుష్మాదేవి తన పిల్లలు, సోదరి పూనమ్ కుమారితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. తన సోదరిని చంపినందుకు నిందితుడు రమేష్‌ను ఉరితీయాలని పూనమ్‌ డిమాండ్‌ చేశారు. ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దం వినబడటంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సుష్మా దేవి, రమేష్‌లకు 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగిందని తెలిసింది. నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని గయ ఎస్‌ఎస్‌పీ ఆనంద్‌ కుమార్‌(Jitan Ram Manjhi)వెల్లడించారు. ఫోరెన్సిక్‌ బృందం, టెక్నికల్ నిపుణులను ఆధారాల సేకరణకు ఘటనా స్థలానికి పంపామన్నారు.

ఇదే ఏడాది..  మరో కేంద్ర మంత్రి మేనల్లుడి మర్డర్

ఇదే ఏడాది మార్చి నెల మూడోవారంలో బిహార్‌లో మరో దారుణ మర్డర్ జరిగింది. అయితే ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మేనల్లుడు విశ్వజిత్ యాదవ్ మర్డర్‌కు గురయ్యారు. భాగల్‌పుర్‌ పరిధిలోని జగత్‌పుర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిత్యానందరాయ్ బావ రఘునందన్ యాదవ్ కుమారులైన జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్‌ల మధ్య మంచి నీళ్ల గ్లాసు విషయంలో గొడవ జరిగింది. ఇంట్లో పనిచేసే వ్యక్తి నీటిని అందించే సమయంలో జరిగిన చిన్న పొరపాటు ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో విశ్వజిత్ యాదవ్ అక్కడికక్కడే చనిపోయాడు.జైజిత్ యాదవ్‌కు గాయాలయ్యాయి.