Site icon HashtagU Telugu

Indian immigrants : అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదు..!

The process of moving illegal immigrants is nothing new..!

The process of moving illegal immigrants is nothing new..!

Indian immigrants : అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ (డిపోర్టేషన్) కొత్తది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించడంపై కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. డీపోర్టేషన్‌ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.

Read Also: Reliance Income Tax: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత ఆదాయపు పన్ను చెల్లిస్తుందో తెలుసా?

ఈ అంశంపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. తమ పౌరులు విదేశాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే.. వారిని తిరిగి తీసుకోవడం మన బాధ్యత. అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోంది. 2009 నుంచి బహిష్కరణలు జరుగుతున్నాయి. భారత్ నుండి అక్రమ వలసలను అరికట్టేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా తిరిగి పంపించడమే మౌలిక విధానం.

ఒక దేశానికి చెందిన ప్రజలు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు, వారిని తమ స్వదేశాలకు రప్పించడం ఆ దేశాల బాధ్యత అని జైశంకర్‌ వివరించారు. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా.. 2019లో 2వేలకు పైగా ఉంది. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలి. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జైశంకర్‌ వివరించారు. అమెరికాలో బహిష్కరణ వ్యవహారాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుందని.. ఇది- 2012లో అమలులోకి వచ్చిందని అన్నారు. అయితే వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడం అమెరికా విధానం. ఈ జర్నీలో అవసరమైనప్పుడు వాటిని తొలగిస్తారు. వారికి అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూడా సమకూరుస్తారు అని జైశంకర్‌ తెలిపారు.

Read Also: PECET : తెలంగాణ పీఈ సెట్‌ షెడ్యూల్‌ విడుదల