Site icon HashtagU Telugu

Kangana : ఆ సమయంలో వచ్చే బాధ.. ఎంపీలకూ తప్పదు.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

The pain that comes at that time.. is inevitable for MPs too.. Kangana Ranaut's key comments

The pain that comes at that time.. is inevitable for MPs too.. Kangana Ranaut's key comments

Kangana : నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు సామాన్యంగా మాత్రమే ఉంటాయని భావించవద్దని, అవి సెలబ్రిటీలకు సైతం భిన్నంగా లేవని ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొంటున్న అసౌకర్యాలను ఆమె బహిరంగంగా పంచుకున్నారు. సినీ రంగంతో పోల్చితే రాజకీయ రంగంలో మహిళగా ఎదురవుతున్న సమస్యలు మరింత క్లిష్టంగా ఉంటాయని ఆమె వివరించారు. కంగనా మాట్లాడుతూ..చలనచిత్ర పరిశ్రమలో నేను పనిచేస్తున్నప్పుడు ఎంతో ప్రొఫెషనల్ పరిస్థితే ఉండేది. అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్తే, కారవాన్‌ అందుబాటులో ఉండేది. పీరియడ్స్‌ సమయంలో కూడా సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశాలు ఉండేవి. టాయిలెట్‌ సదుపాయాలు, విశ్రాంతి అవసరమైనపుడు బ్రేక్‌లు, వేడి నీరు అన్నీ అందుబాటులో ఉండేవి. కానీ రాజకీయ రంగంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రతి రోజు ఒక కొత్త ప్రాంతంలో ప్రయాణం. ఒక్కోసారి రోజుకు 10–12 గంటల పాటు కాంటిన్యూగా మిషన్ల మీద ఉంటాం. టాయిలెట్‌ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇలా మారిన వాతావరణంలో, ఒక మహిళగా నేను తట్టుకుంటున్న బాధను మాటల్లో చెప్పలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Free Bus Scheme in AP : ఉచిత బస్సుతో ఒక్కొక్కరికీ ఎంత డబ్బు మిగులుతుందో తెలుసా..?

ఈ సమస్య కేవలం తనకే కాదు, ఇతర మహిళా ఎంపీలకూ ఉందని కూడా కంగనా పేర్కొన్నారు. “ఇది చిన్న విషయమని చాలామంది భావిస్తారు. కానీ ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్య. దీన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఎంతో శారీరక, మానసిక ఒత్తిడిని కలిగించే సమస్య ఇది. పాలిసీ మేకర్స్‌గా మేము ఇలాంటి అంశాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. సినీ రంగంలో 2006లో అడుగుపెట్టి తన ప్రతిభతో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న కంగనా, 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోకసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం ఆమె మహిళల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో ఉన్నా, తాను మహిళగా ఎదుర్కొంటున్న సవాళ్లను తీసిపోకుండా, వాటిని ఓపెన్‌గా చెప్పడం వల్ల ఇతర మహిళలకు సైతం శక్తినిచ్చే ప్రయత్నంగా ఇది నిలుస్తోంది. కంగనా చెప్పిన ఈ విషయాలు ఇప్పటివరకు రాజకీయ నేతలందరూ పెద్దగా మాట్లాడని అంశాలను హైలైట్ చేస్తూ, మహిళా నేతలకు ఎదురయ్యే అసౌకర్యాలను కేంద్రంలోకి తీసుకువచ్చాయి. అభివృద్ధి, బలమైన నాయకత్వం మాత్రమే కాక, వ్యక్తిగతంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని ఆమె వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

Read Also: GST : జీఎస్టీలో మార్పులు.. ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..!