2 Crore SIMs : సైబర్ నేరాల కట్టడికి కేంద్ర టెలికాం శాఖ నడుంబిగిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి తీసుకున్న సిమ్ కార్డుల రద్దు దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. మన దేశంలో దాదాపు 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దవుతాయి. 2.26 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ అవుతాయి.
Also Read :Panther Attack : వామ్మో పులి.. 11 రోజుల్లో ఏడుగురిని చంపేసింది
ఫేక్ సిమ్ కార్డుల రద్దు, ఫేక్ మొబైల్ ఫోన్ల బ్లాకింగ్‌కు సంబంధించిన అంశంపై ఇటీవలే కేంద్ర హోంశాఖ కూడా సమీక్షించింది. ఈ దిశగా చేపట్టనున్న చర్యల సమాచారం వివరాలతో ఒక నివేదికను హోంశాఖకు టెలికాం శాఖ సమర్పించిందని తెలిసింది. కొత్త సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని టెలికాం శాఖ కేంద్రానికి(2 Crore SIMs) తెలియజేసింది. సిమ్ కార్డుకు అప్లై చేసేవారు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తామని వెల్లడించింది. ఫేక్ సిమ్ కార్డుల జారీని ఆపితే చాలావరకు సైబర్ ఫ్రాడ్స్ ఆగుతాయని టెలికాం శాఖ వర్గాలు అంటున్నాయి. భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయాలని కొన్ని నెలల క్రితమే టెలికాం ఆపరేటర్లను టెలికాం శాఖ ఆదేశించింది.
Also Read :Atom Bomb : ఆటం బాంబుతో ఇజ్రాయెల్‌కు జవాబివ్వండి.. ఇరాన్ అతివాదులు
ఈ దిశగా పలు టెలికాం కంపెనీలు చర్యలను మొదలుపెట్టాయి. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునే దిశగా ఎయిర్ టెల్ తొలి అడుగు వేసింది. సెప్టెంబరు 26న ఎయిర్ టెల్ తమ యూజర్ల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేసే స్పామ్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది స్పామ్ కాల్, మెసేజ్‌లను గుర్తించి యూజర్‌కు సమాచారం అందిస్తుంది. దాన్ని చూశాక.. ఆ నంబరును/మెసేజ్‌ను బ్లాక్ చేయాలా ? వద్దా ? అనేది యూజరే నిర్ణయించుకోవాలి. ప్రజలను సైబర్ క్రైమ్స్ నుంచి కాపాడేందుకు, టెలికాం యూజర్లకు స్పామ్ కాల్స్/మెసేజ్‌ల చికాకు లేకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.