Site icon HashtagU Telugu

Tata Vs Pakistan : పాక్ జీడీపీని దాటేసిన టాటాగ్రూప్.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా ?

Tata Vs Pakistan

Tata Vs Pakistan

Tata Vs Pakistan :  టాటా గ్రూప్.. మరోసారి మనదేశ గౌరవాన్ని పెంచింది. ది గ్రేట్ అనిపించుకుంది.  రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్ రూ. 30 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి భారత చరిత్రలో మరే కంపెనీ సాధించని కొత్త రికార్డులను నమోదు చేసింది. మన పొరుగు దేశం పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని కూడా టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్ విలువ దాటేయడం విశేషం. గత ఏడాది వ్యవధిలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు  భారీగా పెరిగాయి. అద్భుతమైన రాబడి వచ్చింది. ఆ కంపెనీల ఉమ్మడి విలువ పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ కంటే ఎక్కువగా నమోదైంది. టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 30.3 లక్షల కోట్లకు చేరుకోగా.. పాకిస్తాన్ జీడీపీ విలువ రూ. 28.3 లక్షల కోట్ల వద్దే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్  అప్పులు, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join

టాటా ఘణాంకాలు

Also Read :Zomato – Ecommerce : ఈ-కామర్స్‌లోకి జొమాటో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లకు పోటీ

పాక్ గణాంకాలు

Also Read : Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్‌ ఈవెంట్స్