Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయి కదూ!! 2008 సంవత్సరం నవంబరు 26 నుంచి 29 వరకు ఈ ఉగ్రదాడి కొనసాగింది. 9 మంది ఉగ్రవాదులు భారతదేశ వాణిజ్య రాజధానిపై జరిపిన ఈ టెర్రర్ ఎటాక్‌లో 175 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఉగ్ర దాడి కోసం తెర వెనుక నుంచి స్కెచ్ గీసిన ఉగ్రవాదుల్లో ఒకడు తహవ్వుర్ రాణా. అతగాడు ఇవాళ (బుధవారం) రాత్రి లేదా రేపు (గురువారం ) ఉదయంకల్లా భారత్‌కు చేరుకోనున్నాడు. భారతీయ అధికారుల బృందం తహవ్వుర్ రాణాను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి భారత్‌కు తీసుకొస్తోంది. ఈరోజు ఉదయమే వారి విమానం భారత్‌కు బయలుదేరిందట. అతగాడు భారత్‌కు రాగానే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), భారత గూఢచార విభాగం రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) విచారించే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు తహవ్వుర్ రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెడతారని సమాచారం. తహవ్వుర్ రాణా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ఇప్పటివరకు వివిధ కేసుల్లో అతగాడు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ జైలులో శిక్షను అనుభవించాడు.
Also Read :Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
అమెరికాలోనూ భారత్ వాదనే నెగ్గింది..
ముంబై ఉగ్రదాడుల్లో తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే అమెరికా కోర్టులకు భారత్ సమర్పించింది. వాటన్నింటినీ పరిశీలించిన అమెరికా కోర్టులు.. తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని ఆదేశించాయి. చాలా అమెరికన్ కోర్టుల్లో తహవ్వుర్ రాణా అప్పీల్ పిటిషన్లు వేసినా ఫలితం లేకపోయింది. అన్ని కోర్టులూ భారత్ వాదననే సమర్ధించాయి. తహవ్వుర్ రాణా తప్పు చేసి, శిక్ష నుంచి, విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అమెరికన్ న్యాయస్థానాలు మండిపడ్డాయి. మొత్తాన్ని న్యాయమే గెలిచింది. భారత్ వాదనే నెగ్గింది.
Also Read :MBiPC Benefits : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ
మోడీ సమక్షంలో ట్రంప్ ప్రకటన
ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. ఆసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘26/11 ముంబై ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు మేం అప్పగించబోతున్నాం. త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు.