Site icon HashtagU Telugu

Gold Smuggling : సూరత్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Gold Smuggling

Gold Smuggling

Gold Smuggling : సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం రవాణా ప్రయత్నం విఫలమైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ దంపతుల వద్ద భారీ మొత్తంలో బంగారం పేస్ట్‌ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది పట్టుకున్నారు. మొత్తం 28 కిలోల బంగారం స్వాధీనం చేయబడింది. ఈ ఘటన విమానాశ్రయంలోనే కాకుండా గుజరాత్ రాష్ట్రంలోనూ కలకలం రేపింది.

దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ IX-174లో వచ్చిన ఈ జంటపై CISF ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా కాకుండా వీరి కదలికలు, ప్రవర్తనలో ఏదో గందరగోళం కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు కూడా దర్యాప్తులో భాగమై వీరిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

Harassment : బూతులు తిడుతూ నరకం చూపిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్

28 కిలోల బంగారం పేస్ట్ స్వాధీనం
తనిఖీలలో మహిళ వద్ద 16 కిలోలు, పురుషుడి వద్ద 12 కిలోల బంగారం పేస్ట్ దొరికింది. వీరు ఈ బంగారం పేస్ట్‌ను శరీరంపై గట్టిగా కట్టిన ఫాబ్రిక్ బెల్ట్‌లలో దాచినట్లు గుర్తించారు. మొత్తం బంగారం విలువ సుమారు రూ. 23 కోట్లుగా అంచనా వేసారు. అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారు.

దర్యాప్తు కొనసాగుతోంది
ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్‌ను వెలికితీసేందుకు CISF, కస్టమ్స్ శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. దుబాయ్ నుంచి తరచుగా జరిగే అక్రమ బంగారం రవాణాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఈ సంఘటనతో సూరత్ విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు మరింత కఠినతరం చేయనున్నారు.

Sleeping Amenia : స్లీపింగ్ అమ్నియాతో బాధపడుతున్నారా? దీని లక్షణాలు మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి