Site icon HashtagU Telugu

Dharam Sansad : ‘ధర్మ సంసద్‌’ను ఆపలేం.. విద్వేష ప్రసంగాలను మానిటరింగ్ చేయండి : సుప్రీంకోర్టు

Supreme Court Up Dharam Sansad Hate Speech

Dharam Sansad : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ కేంద్రంగా ఈనెల 17న ధర్మ సంసద్ మొదలైంది.ఈనెల 21 వరకు ఇది కొనసాగనుంది. వివాదాస్పద ప్రసంగాలతో ఫేమస్ అయిన యతి నరసింఘానంద్  ఈ సదస్సును ఏటా నిర్వహిస్తుంటారు. ధర్మ సంసద్‌ నిర్వహణను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తోసిపుచ్చింది. ఆ సదస్సులో జరిగే ప్రసంగాలను మానిటరింగ్ చేసి, విద్వేష పూరిత వ్యాఖ్యలు ఉంటే గుర్తించాలని నిర్దేశించింది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పును వెలువరించింది .

Also Read :Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు

‘‘ఈ తరహా పిటిషన్లను నేరుగా మేం స్వీకరించలేం. ఒకసారి  ఇలాంటి పిటిషన్లను మేం నేరుగా స్వీకరిస్తే.. వరుసగా ఇలాంటి చాలా మాకు క్యూ కడతాయి. కావాలంటే మీరు హైకోర్టును సంప్రదించండి’’ అని పిటిషనర్లకు సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. ‘‘ఈ పిటిషన్‌ను మేం తోసిపుచ్చుతున్నామంటే.. ధర్మ సంసద్‌లో ఏది జరిగినా ఫర్వాలేదు అని అర్ధం కాదు. ఆ జిల్లా అధికార యంత్రాంగం ధర్మ సంసద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. విద్వేష పూరిత ప్రసంగాలు జరగకుండా చూడాలి. ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలి’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన  అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వారిలో.. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణా రాయ్, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు సయ్యదా హమీద్ ఉన్నారు.

Also Read :Innocent Victims : అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్.. నలుగురు పిల్లలకు గాయాలు.. బాలిక మెడలోకి బుల్లెట్

‘‘ధర్మసంసద్(Dharam Sansad) కోసం ఇటీవలే గజియాబాద్‌లో ఇచ్చిన ప్రకటనల్లోనూ హింసాత్మక సందేశాలు ఉన్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా మరో వర్గం వారిని రెచ్చగొట్టేలా ఆ సందేశాలు ఉన్నాయి.  అయినా వాటిని ఆపేందుకు గజియాబాద్ పోలీసులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ చర్యలు చేపట్టడం లేదు. ఇలాంటి చర్యలను ఆపాలని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను గజియాబాద్ పోలీసులు, అధికార యంత్రాంగం పాటించడం లేదు’’ అని పిటిషనర్లు వాదించారు. వారి తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నరసింఘానంద్‌కు వివాదాస్పద వ్యాఖ్యల చరిత్ర ఉందని.. శాంతిభద్రతలను కాపాడేందుకు అటువంటి వ్యక్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దిగువ కోర్టులను సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది.